పరారీలో పెదరాయుడు ? అల్లు అర్జున్ ఎపిసోడ్ తో - పోలీసుల గాలింపు..!

కుమారుడు మంచు మనోజ్ తో కుటుంబ వివాదాల నేపథ్యంలో కవరేజ్ కు వచ్చిన జర్నలిస్టుపై దాడి చేసిన టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు ఇవాళ తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. పోలీసులు ఆయనపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మోహన్ బాబు పరారయ్యారు.

జల్ పల్లిలోని తన ఇంట్లోకి కొడుకు మనోజ్ , ఆయన భార్య మౌనికా రెడ్డితో కలిసి చొరబడుతున్న సమయంలో అక్కడ న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన టీవీ9 జర్నలిస్టు రంజిత్ పై మోహన్ బాబు ఆయన మైక్ తోనే దాడి చేశారు. దీంతో రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు .. మోహన్ బాబుపై హత్యాయత్నంతో పాటు ఇతర కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన అరెస్టు తప్పదని తేలిపోయింది.

mohan babu in absconding after high court refused anticipatory bail in journalist attack case

ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది. దీంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మొత్తం ఐదు బృందాలు ఏర్పాటు చేసి మోహన్ బాబును రాచకొండ పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో రాజీ కోసం కూడా మోహన్ బాబు కుటుంబం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+