ఎన్‌కౌంటర్: ఒక మవోయిస్టు గుర్తింపు, మృతుల్లో కంకణాల రాజిరెడ్డి?

Recommended Video

    Encounter : Ten Maoists And A Constable Lost Life

    భద్రాచలం: ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించే పని సాగుతోంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన పది మంది మావోయిస్టుల మృతదేహాలు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి చేరుకున్నాయి.

    మృతుల్లో ఒకరిని గుర్తించారు. వరంగల్ జిల్లా ఏరియా కమిటీ కార్యదర్శి దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్‌ను గుర్తించారు. ఆయనది వరంగల్ జిల్లా మడికొండ శివారులోని రాంపేట. మృతుల్లో కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

    Moists dead bodies at Bhadrachalam: one identified

    ఎన్‌కౌంటర్ జరిగి 24 గంటల సమయం దాటింది. ఫొటోల ఆధారంగా మావోయిస్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొంత మంది మాజీ నక్సలైట్ల సాయం కూడా తీసుకుంటున్నారు.

    పోస్టుమార్టం నిర్వహణకు నలుగురు వైద్యులు, నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు ఆస్పత్రికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోస్టుమార్టం ప్రక్రియ యావత్తు వీడియో చిత్రీకరణ జరగనుంది.

    Moists dead bodies at Bhadrachalam: one identified

    మృతుల్లో సుజాతక్క, నరేష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారు జామును తెలంగాణలో చర్ల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే. వారిలో నలుగురు మహిళా నక్సలైట్లు ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+