తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల రాక ముహూర్తం - కానీ, బిగ్ అప్డేట్..!!

ఈ సారి రుతుపవనాలు ముందుగానే వస్తున్నాయి. ఇప్పటికే అండమాన్ తాకిన రుతువపనాలు మే నెలాఖారుకే కేరళను తాకనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత కేరళ నుంచి ఏపీ లోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి జూన్‌ 5 నుంచి 8తేదీల మధ్యన ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

నైరుతి రాక
జూన్‌ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్‌ 11వ తేదీలోపే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది రుతుపవనాలు మే నెలాఖారుకే కేరళను తాకనున్నట్లు అధికారులు వివరించారు. ఒకవేళ ఆలస్యమైనా జూన్‌ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని స్పష్టం చేసింది. గతేడాది రుతుపవనాలు కేరళకే జూన్‌ 11న వచ్చాయని, అందుకే తెలంగాణలో జూన్‌ 20 తర్వాతే రుతుపవనాలు విస్తరించాయని వివరించింది.

Monsoon expected to arrive in Telangana on June 11 AP to have above normal monsoon

మారుతున్న వాతావరణం
ప్రస్తుతం మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మే 26 వరకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. మే 22న కుమురం భీమ్‌ మినహా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అల్పపీడనంతో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారి...తరువాత తఫాన్ గా మార్పు చెందే అవకాశం ఉంది. ఈ నెల 25న రాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ కు రీమల్ గా నామకరణం చేసారు. దీంతో..నాలుగు రోజులు మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చిరిక జారీ చేసారు. దీంతో..ఏపీలో నేటి నుంచి ఎండలు పెరుగుతాయని...26వ తేదీ నుంచి వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+