Monsoons: నేడు తెలంగాణలోకి ప్రవేశించనున్న రుతుపనాలు..!
వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినా రాష్ట్రలో వర్షాల జాడ లేక రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. జూన్ 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద ఆగిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైందని పేర్కొంది. సోమవారం ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
జూన్ 21 అంటే నేడే తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 24 వరకు రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించింది. అయితే రుతుపవనాలు వచ్చినా.. జూన్ 25 తెలంగాణలో స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వ్యవసాయదారులు శనివారం నుంచి పనులు ప్రారంభించుకోవచ్చని చెప్పింది. అరేబియా సముద్రంలో ఏర్పాడిన బిపార్ జాయ్ తుఫాన్ వల్ల రుతుపవనాలు ఆలస్యంగా వస్తున్నట్లు వివరించింది.

మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని పలు చోట్లు ఉరుమురు, మెరుపులతో కూడిన తేలిపాటి జల్లులు పడే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం కూడా రాష్ట్రంలో తీవ్రంగా ఎండ ఉంది. చాలా చోట్లు సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 13 జిల్లాల్లోని 36 మండలాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 10 మండలాల్లో వడ గాల్పుల తీవ్రత ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం కూడా రాష్ట్రంలోని కోన్ని జిల్లాల్లో వడ గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
కరీంనగర్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో వడ గాలులు వీస్తాయని పేర్కొంది. అటు ఏపీలో రుతుపనాలు ఇప్పటికే ప్రవేశించాయి. రాయసీమంతాట రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం విజయవాడలో మోస్తరు వర్షం పడింది. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది.












Click it and Unblock the Notifications