Monsoons: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..!

వర్షాకాలం సమీపిస్తున్న తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే ఈ వేడి వారం రోజులు భరించక తప్పదని తెలుస్తోంది. అయితే ఏపీలో మాత్రం రేపు లేదా ఎల్లుండి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో ఏపీలో విస్తరంగా వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏపీలో మొదటగా రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెబుతున్నారు. మరోవైపు నేటి నుంచి ఏపీలో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దక్షిణ కోస్తాలో మాత్రం వడగాలులు కొనసాగనున్నాయి. ఇక తెలంగాణలోకి జూన్ 9 లేదా 10 రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు రాష్ట్రంలోకి రాగానే వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది.

Monsoon will spread in Telugu states in the next week

రుతుపవనాలు మే 30 తేదీనే కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరాన్నే కాదు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాలతో కేరళలో విస్తరంగా వర్షాలు కురిస్తున్నాయి. కేరళ అంతట విస్తరించిన రుతుపవనాలు తమిళనాడులోని కొంత భాగం, కర్ణాటకలోని చాలా చోట్లకు కూడా విస్తరించాయి. ఈసారి వర్షాకాలం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

లానినా పరిస్థితిలో నేపథ్యంలో వాతావరణ శాఖ మంచి వర్షపాతాన్ని ఆశిస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+