మూడీస్ సంస్థ షాక్.. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం రేటింగ్ తగ్గింపు..

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానశ్రయం రేటింగును బీఏ1 నుంచి బీఏ2కి తగ్గించింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(DIAL) ర్యాంకును కూడా బీఏ3కి తగ్గించింది. మార్చి నెలలో ఈ రెండు ఎయిర్‌పోర్టుల ర్యాంకింగ్స్‌ను మూడీస్ రివ్యూకి పెట్టింది.

కరోనా వైరస్ పరిస్థితులతో పాటు.. ఆర్థికపరమైన సవాళ్ల నేపథ్యంలో రాబోయే రెండు,మూడేళ్లలో ఈ విమానాశ్రయాల ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉన్నందున రేటింగును తగ్గించినట్టు మూడీస్ సీనియర్ అనలిస్ట్,వైస్ ప్రెసిడెంట్ స్పెన్సర్ ఎన్‌జీ తెలిపారు.

Moodys downgrades Hyderabad Airports rating to Ba2 delhi IGI to Ba3

'దాదాపు 2 నెలల తర్వాత మే 25న భారత్‌లో పునురుద్దరించిన దేశీ విమాన సర్వీసుల ట్రాఫిక్‌ను రేటింగ్‌ కోసం పరిగణలోకి తీసుకున్నాం. అలాగే నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి యాజమాన్యాలు చేసిన ప్రయత్నాలు,మూలధన వ్యయంలో జాప్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నాం.' అని స్పెన్సర్ తెలిపారు.

ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం రాబోయే రెండు,మూడేళ్లలో రూ.9800కోట్లుతో భారీ విస్తరణకు ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇందుకు కావాల్సిన నిధుల సమీకరణ కష్టమవుతుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విమానాశ్రయ ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావం పడింది.

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వాణిజ్యం,ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని మూడీస్ పేర్కొంది. అనేక రంగాలు,మార్కెట్లు తీవ్ర కుదుపుకు లోనైట్టు తెలిపింది. అలాగే ఏవియేషన్ ఇండస్ట్రీపై కూడా దాని ప్రభావం ఎక్కువగానే ఉన్నట్టు చెప్పింది.

Recommended Video

    Hyderabad Lockdown : మంత్రి Talasani Srinivas Yadav కీలక వ్యాఖ్యలు

    ముఖ్యంగా ఇండియా ఏవియేషన్ ఇండస్ట్రీ దాదాపు 3.6బిలియన్ డాలర్ల మేర నష్టపోనున్నట్టు అంచనా కెపా ఇండియా కన్సల్టెన్సీ ఇదివరకే అంచనా వేసింది. ఇందులో దేశీ విమాన సంస్థలు వచ్చే త్రైమాసికానికి 1.75బిలియన్ డాలర్ల మేర నష్టపోతాయని అంచనా వేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+