జూ సిబ్బందిపై దుప్పి దాడి: ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కులో సంరక్షకులుగా పని చేస్తున్న ఇద్దరిపై దుప్పి దాడి చేసింది. ఒకరికి స్వల్ప గాయాలు కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జూలో యానిమల్ కీపర్లుగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ మీర్జా అక్బర్‌బేగ్, కృష్ణారెడ్డి ఆహారం అందించేందుకు చిత్తడి నేల దుప్పి ఎన్ క్లోజర్‌లోకి వెళ్లారు.
కాగా, ఆ దుప్పి ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. దుప్పి దాడిలో కృష్ణారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అక్బర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో తొలుత కృష్ణారెడ్డి జింకల దాడిలో గాయపడ్డాడు. అప్రమత్తమైన అక్బర్ వాటిని నిరోధించేందుకు ప్రయత్నంచగా అతడిపైనా దుప్పి దాడికి దిగింది.

కొమ్ములతో దాడి చేసి ఓ చెట్టుకు గుద్దింది. దీంతో అతని నడుము, కాలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి ఉద్యోగులు వెంటనే జూ వైద్యులకు సమాచారం అందజేశారు. దీంతో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు.
ఆ తర్వాత అక్బర్‌ను హుటాహుటిన మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయ స్థితి ఏమిలేదని, తొంటి ఎముక విరిగిందని వైద్యులు తెలిపారు. అయితే ఇలా దుప్పులు, జింకలు దాడి చేసిన పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదని జూ అధికారులు, సిబ్బంది చెప్పారు.
రామగుండం-2ఏ గనిలో కూలిన పైకప్పు
కరీంనగర్: జిల్లాలోని రామగుండం-2ఏ బొగ్గు గనిలో పైకప్పు కుప్పు కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. కార్మికులను గోదావరి ఖని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications