రేప్ కేసు: బాలీవుడ్ నిర్మాత కరీం మోరానీకి కస్టడీ, పొటెన్సీ టెస్ట్!

బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీని విచారించేందుకు హయత్‌నగర్ పోలీసులకు ఐదు రోజుల కస్టడీకి అనుమతి లభించింది. కోర్టు అనుమతితో మొరానీని ఆదివారం ఉదయం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

హైదరాబాద్: సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసుల ముందు లొంగిపోయిన బాలీవుడ్‌ నిర్మాత కరీంమోరానీకి హయత్‌నగర్‌లోని ఏడో మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. తదుపరి విచారణ నిమిత్తం హయత్‌నగర్‌ పోలీసులు కస్టడీ కోరగా... సెప్టెంబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు.

విచారణ పూర్తెన తర్వాత మొరానీని 28 సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ముందు హాజరుపర్చాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఉత్తర్వులను ఇచ్చింది. ఈ క్రమంలో కరీంమోరానీ నుంచి కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Morani undergoes potency test, sent to police custody

మొదటి రోజు విచారణ నేపథ్యంలో కరీం మోరానీని హయత్‌నగర్ పీఎస్‌లో పెట్టి ఇన్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీం మోరానీపై హయత్‌నగర్ పోలీసులు నిర్భయతో పాటు మరికొన్ని కేసులను జనవరి 10న నమోదు చేసిన విషయం తెలిసిందే.

దర్యాప్తులో భాగంగా కరీం మోరానీ నుంచి వివరాలు సేకరించనున్నారు. ప్రధానంగా మోరానీ తన వద్ద బాధితురాలి నగ్న ఫొటోలు ఉన్నాయని బెదిరించిన ఆరోపణలపై పోలీసులు అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోనున్నారు.

అదే విధంగా సిటీలోని హోటల్‌లో తనపై లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలి చేసిన ఆరోపణలపై పోలీసులు మరోసారి హోటల్ సిబ్బందితో పాటు ఆమెను విమానాశ్రయం నుంచి హోటల్‌కు తీసుకువచ్చిన క్యాబ్ డ్రైవర్లు, విమాన టిక్కెట్ బుక్ చేసిన ఏజెంట్ నుంచి కరీం మోరానీకి సంబంధించిన విషయాలపై స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారని తెలిసింది. అంతేగాక, నిందితుడైన కరీం మోరానీకి లైంగిక సామర్థ్య పరీక్ష(పొటెన్సీ టెస్ట్) కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+