సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇక.. ప్రయాణీకులు కోరుకున్న విధంగా..!!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై కీలక అప్డేట్. ఆధునీకరణ పనులు స్టేషన్ లో తుది దశకు చేరాయి. ప్రయాణీకుల సౌకర్యాల కోసం రైల్వే అధికారులు కీలక మార్పులు చేస్తున్నారు. విమానాశ్రయం తరహాలో తీర్చి దిద్దుతున్న ఈ స్టేషన్ లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అదే విధంగా ప్రయాణీకులు కోరుకున్న విధంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక, తిరిగి స్టేషన్ ను పూర్తి స్థాయిలో మరో రెండు నెలల కాలంలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రయాణీకుల కోసం తాజాగా మరో నిర్ణయం అమలు చేస్తున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్ ను విమానాశ్రయ హంగులతో తీర్చి దిద్దుతున్నారు. సికింద్రాబాద్​రైల్వేస్టేషన్​ నుంచి రోజుకు దాదాపు 80 ఎక్స్​ప్రెస్​, మరో 100 ప్యాసింజర్​ రైళ్లు వచ్చి పోతుంటాయి. ఈ రైల్వేస్టేషన్​నుంచి రోజుకు 2 నుంచి 3లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కాగా, ఆధునీకరణ పనులతో పాటుగా స్టేషన్ పైన ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లితో సహా ఇతర స్టేషన్ల నుంచి పలు రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు. కాగా, రైల్వే శాఖ సికింద్రాబాద్ లో అభివృద్ధి పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పాటుగా మళ్లించిన రైళ్లను ఈ స్టేషన్ మీదుగా మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

more-skywalks-in-hyderabad-will-link-to-metro-stations-as-hmda-latest-proposals

ఇక, ప్రయాణీకులు స్టేషన్ లోపలకు రావటానికి.. బయటకు వెళ్లటానికి ఇబ్బంది లేకుండా మరో నిర్ణయం కార్యరూపం దాల్చుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అన్ని వైపులా కలుపుతూ స్కైవాక్ నిర్మించడానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. ఈ స్కైవాక్ ద్వారా ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుండి బస్ స్టేషన్ , మెట్రో స్టేషన్ లకు నేరుగా వెళ్ళడానికి వీలుంటుంది. ఈ స్కైవాక్ ను 800 మీటర్ల పొడవున నిర్మించనున్నారు. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ చుట్టూ 800 మీటర్ల పొడవున స్కైవాక్ నిర్మించనున్నారు. దీనికి దాదాపు 30 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుతం రేతిఫైల్ బస్టాండ్ నుండి మెట్రో ఈస్ట్ స్టేషన్ వరకు కలుపుతూ స్కైవాక్ ఉంది. కానీ వెస్ట్ వైపు మెట్రో స్టేషన్‌తో పూర్తిగా కనెక్ట్ కాలేదు. దీంతో, ఈ స్కై వాక్ ద్వారా ఈ సమస్యలను తొలిగించాలని నిర్ణయించింది. జనవరి సంక్రాంతి సమయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ తిరిగి పూర్తి స్థాయి ఆపరేషన్స్ తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+