Bandi Sanjay: ఎంపీ పదవి కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్ష..
తాను ఏ స్థాయికి ఎదిగినా అది కరీంనగర్ ప్రజల పెట్టిన భిక్షేనని హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత తొలిసారికి కరీంనగర్ కు వచ్చారు. కరీంనగర్ పట్టణంలో నేలపై పడుకుని కరీంనగర్ నేలకు సాష్టాంగ నమస్కారం చేశారు బండి సంజయ్. సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే గానికి బీజేపీనే కారణమని చెప్పారు. కార్యకర్తల కష్టార్జితం వల్లే ఈరోజు తనకు కేంద్రమంత్రి పదవి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు.
కార్యకర్తలు.. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామయాత్రతో తన వెంట ఉన్నారని గుర్తు చేశారు. తన పదవి, హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కమిట్ మెంట్ తో పని చేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టే కేంద్రం తనను గుర్తించిందని తెలిపారు. కేంద్రమంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని చెప్పారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అందరిని కలుపుకుని ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. అంతకు ముందు బండి సంజయ్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ కుమార్ ఈనెల 8వ తేదీన ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసింది. బండి సంజయ్ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగారు.
మొదటి నుంచి ఒకే పార్టీలో కొనసాగారు. కార్పొరేటర్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించి మంత్రి అయ్యారు.












Click it and Unblock the Notifications