చేతులు ఎలా వచ్చాయి తల్లి..!
ఇది హృదయాన్ని మెలిపెట్టే దృశ్యం... కన్న కొడుకును అనాథగా వదిలేసి, ప్రియుడితో వెళ్లిపోయిన ఓ కఠిన తల్లి కథ ఇది. హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చిన ఓ మహిళ, తన ప్రియుడి కోసం ఏకంగా తన బిడ్డనే బస్టాండ్‌లో వదిలేసి, అతడితో బైక్‌పై వెళ్లిపోయింది.
అమ్మకోసం అల్లాడుతూ, బస్టాండ్‌లోనే తిరుగుతున్న ఆ పసివాడిని చూసిన ప్రయాణికులు చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మానవత్వం చూపిన ఆ ప్రయాణికుల చొరవతో పోలీసులు రంగంలోకి దిగారు. బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించి, ఆ మహిళ ఆనవాళ్లను గుర్తించారు.

సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆ తల్లి, ఆమె భర్తను గుర్తించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటివరకు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఆ చిన్నారిని, అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రియుడి మోజులో కన్నపేగు బంధాన్ని తెంచుకున్న ఆ తల్లి చర్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఘటన సమాజంలో నైతిక విలువల పతనాన్ని, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని మరోసారి కళ్ళకు కట్టింది. బిడ్డను వదిలేసిన తల్లిపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications