ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలను చంపి, ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలానగరం మండలం గంగాధరపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కౌసల్య, బిక్షపతి ఇద్దరు భార్యా భర్తలు వీరికి ముగ్గురు పిల్లలు. భర్త కూలి పని చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కౌసల్య మాత్రం గంగాధరపల్లిలో పిల్లలతో ఉంటుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం పదేళ్ల లోపు ఉన్న ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపింది

Mother kills her three children and attempts suicide

పిల్లలను చంపిన అనతరం ఆమె కూడా చెరువులో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను రక్షించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. అత్తాకోడళ్ల మధ్య తగాదాల కారణంగానే ఆమె ఆ తీవ్ర చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. భర్త కూడా తరుచుగా మద్యం సేవించి గొడవ పడేవాడని చెబుతున్నారు.

తాను లేకపోతే పిల్లలను చూసేవారు ఉండరనే భయంతో ఆమె తాను చావడానికి ప్రయత్నించే ముందు పిల్లలను హత్య చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+