కెసిఆర్‌ను అభినందించిన మోత్కుపల్లి: సిఎం మెప్పుకోసమేనని శశిధర్ రెడ్డి
హైదరాబాద్: యాదాద్రి అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేస్తున్న కృషికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అభినందించారు. యాదగిరిగుట్టను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్టను సిద్దిపేటలో కలపాలనుకోవడం బాధాకరమన్నారు. యాదగిరిగుట్టను సిద్దిపేటలో కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదని మోత్కుపల్లి హెచ్చరించారు. యాదగిరిగుట్టును సిద్ధిపేటలో కలపకుండా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విచక్షణారహితంగా ఓట్లను తొలగిస్తున్నారని కాంగ్రెసు నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మెప్పు కోసం హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ సోమేష్, ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఓట్లను తొలగిస్తున్నారని ఆయన సోమవారం ఆరోపించారు.
నోటీసులు ఇవ్వకుండా ఓట్లను తొలగించడం సరి కాదని ఆయన మీడియాతో అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై, ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications