వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ రాక్షసుడు .. షాకింగ్ కామెంట్స్ చేసిన బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు జరుగుతున్నాయి. నిన్న సరూర్ నగర్ లో జరిగిన సభలోనూ కార్మిక సంఘ నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్‌పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆర్టీసీ సమ్మె వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల చావులు కేసీఆర్ చేసిన హత్యలేనని వ్యాఖ్యానించారు. ఇక అంతే కాదు సీఎం కేసీఆర్ పై చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాక్షసుడని, మానవత్వం లేని మృగమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కెసిఆర్ ని మాత్రమే కాకుండా మంత్రుల పైన కూడా విమర్శలు చేసిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు బ్రోకర్లు.. జోకర్లు అని ఘాటుగా మండిపడ్డారు.

MP Bandi Sanjay bitterly commented KCR as a monster

ఇక అంతే కాదు సరూర్ నగర్ లో జరిగిన సకల జన భేరీ సభలో కరీంనగర్ టు డిపో డ్రైవర్ బాబు గుండెపోటుతో మరణించటం బాధాకరమని బండి సంజయ్ పేర్కొన్నారు. కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఆయన కార్మికులను కోరారు. సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు కార్మికులతో కలిసి పోరాటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ కు బుద్ధి చెప్పడానికి, తెలంగాణ ప్రభుత్వ తీరుకు గుణపాఠం చెప్పేందుకు సకలజునులు కలిసిరావాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

English summary
Speaking to the media in the wake of the ongoing RTC workers' strike, he said that even during the Telangana movement, rtc workers fought for telangana . Because of RTC workers KCR had become a CM. Currently, the deaths of RTC workers are murders of the government bandi sanjay stated. Karimnagar MP Bundi Sanjay bitterly commented KCR as a monster
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X