వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్! ఏపీకే పరిమితంకండి, బాబులా సంపాదించలేదు: కవిత ఎద్దేవా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ పార్లమెంటుసభ్యురాలు కవిత.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, టిడిపి నేత నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఆస్తుల వివరాల వెల్లడి విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని అన్నారు. అంతేగాక, ప్రకటించుకునేంత ఆస్తులు త‌మ‌ వద్ద లేవని నిజామాబాద్‌ క‌విత అన్నారు.

శుక్రవారం హైద‌రాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని విమర్శించారు. తాము ఎవ‌రికి లెక్క చూపించాలో వారికే చూపిస్తామ‌ని వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమ అన్నారు. లోకేష్ మొదట్నుంచీ తెలంగాణ వ్యతిరేకేనని ఆమె ఆరోపించారు.

కాగా, ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని టీపీసీసీ నేత‌ జానారెడ్డి మానుకోవాలని ఆమె సూచించారు. మీ రాష్ట్ర రాజకీయాలు మీరు చూసుకుంటే బాగుంటుందని సూచించారు. ఏపీ రాష్ట్ర పాలన గురించి తాము మాట్లాడితే బాగుండదని అన్నారు.

ప్ర‌భుత్వం చేసే ప‌నుల‌పై అన‌వ‌స‌ర రాద్ధాంతం వ‌ద్ద‌ని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం చేసే పనులను తెలుసుకోవచ్చని ప్ర‌తిప‌క్ష పార్టీకి ఆమె సూచించారు. మాతా శిశు మరణాలను తగ్గంచేందుకు ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తామ‌ని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయని, వాటిని చ‌క్క‌దిద్దుతున్నామ‌ని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు అనుకున్నంత మెరుగ్గా పని చేయడం లేదని అన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడాల్సి ఉందనఅభిప్రాయపడ్డారు.

తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగం

ఈ రెండున్నరేళ్ల కాలంలో తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు స్వర్ణయుగం వచ్చిందని కవిత పేర్కొన్నారు.ఈ విధంగానే తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగం కొనసాగాలన్నారు. ఆడబిడ్డలను గౌరవించడం తెలంగాణ సంప్రదాయం అని తెలిపారు. 9 దేశాల్లో జాగృతి నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. ప్రవాస తెలంగాణవాసులే కాకుండా అక్కడి దేశాల ప్రజల కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.

బతుకమ్మ పండుగను విదేశాలు కూడా గౌరవిస్తున్నాయని తెలిపారు. ఆస్ట్రేలియాలో బతుకమ్మ పండుగ మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. అక్కడ జరిగిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు బతుకమ్మ పండుగలో పాల్గొన్నారని తెలిపారు.

మహిళల పాత్రను పెంచేందుకు బతుకమ్మ పండుగ గొప్ప పాత్ర నిర్వహించిందన్నారు. తెలంగాణ అంటే పౌరుషానికి మారుపేరు అని ఏర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ బిడ్డలు పని చేస్తున్నారని తెలిపారు. స్వరాష్ట్రంలో పోరాట వీరులను ఘనంగా స్మరించుకుంటున్నామని చెప్పారు. తెలుగుకు ప్రాచీన హోదా సంపాదించడం సంతోషంగా ఉందన్నారు.

సర్జికల్ దాడులపై రాజకీయం వద్దు

పీఓకేలో భారత్ జరిపిన సర్జికల్ దాడులను రాజకీయం చేయడం సరికాదన్నారు. 2019లో టిఆర్ఎస్ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజల్లో లేని పార్టీల పతనం తప్పదన్నారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తామని పేర్కొన్నారు. చిన్న జిల్లాలతో పరిపాలన సజావుగా సాగుతుందని, సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని చెప్పారు.

బాబులా సంపాదించలేదు

బాబులా సంపాదించలేదు

శుక్రవారం హైద‌రాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని విమర్శించారు. తాము ఎవ‌రికి లెక్క చూపించాలో వారికే చూపిస్తామ‌ని వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమ అన్నారు. లోకేష్ మొదట్నుంచీ తెలంగాణ వ్యతిరేకేనని ఆమె ఆరోపించారు.

కవిత మాట

కవిత మాట

ప్ర‌భుత్వం చేసే ప‌నుల‌పై అన‌వ‌స‌ర రాద్ధాంతం వ‌ద్ద‌ని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం చేసే పనులను తెలుసుకోవచ్చని ప్ర‌తిప‌క్ష పార్టీకి ఆమె సూచించారు. మాతా శిశు మరణాలను తగ్గంచేందుకు ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తామ‌ని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయని, వాటిని చ‌క్క‌దిద్దుతున్నామ‌ని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు అనుకున్నంత మెరుగ్గా పని చేయడం లేదని అన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడాల్సి ఉందనఅభిప్రాయపడ్డారు.

తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగం

తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగం

ఈ రెండున్నరేళ్ల కాలంలో తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు స్వర్ణయుగం వచ్చిందని కవిత పేర్కొన్నారు.ఈ విధంగానే తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగం కొనసాగాలన్నారు. ఆడబిడ్డలను గౌరవించడం తెలంగాణ సంప్రదాయం అని తెలిపారు. 9 దేశాల్లో జాగృతి నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. ప్రవాస తెలంగాణవాసులే కాకుండా అక్కడి దేశాల ప్రజల కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.

బతుకమ్మ పండుగను విదేశాలు కూడా గౌరవిస్తున్నాయని తెలిపారు. ఆస్ట్రేలియాలో బతుకమ్మ పండుగ మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. అక్కడ జరిగిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు బతుకమ్మ పండుగలో పాల్గొన్నారని తెలిపారు.

మహిళల పాత్రను పెంచేందుకు బతుకమ్మ పండుగ గొప్ప పాత్ర నిర్వహించిందన్నారు. తెలంగాణ అంటే పౌరుషానికి మారుపేరు అని ఏర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ బిడ్డలు పని చేస్తున్నారని తెలిపారు. స్వరాష్ట్రంలో పోరాట వీరులను ఘనంగా స్మరించుకుంటున్నామని చెప్పారు. తెలుగుకు ప్రాచీన హోదా సంపాదించడం సంతోషంగా ఉందన్నారు.

సర్జికల్ దాడులపై రాజకీయం వద్దు

సర్జికల్ దాడులపై రాజకీయం వద్దు

పీఓకేలో భారత్ జరిపిన సర్జికల్ దాడులను రాజకీయం చేయడం సరికాదన్నారు. 2019లో టిఆర్ఎస్ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజల్లో లేని పార్టీల పతనం తప్పదన్నారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తామని పేర్కొన్నారు. చిన్న జిల్లాలతో పరిపాలన సజావుగా సాగుతుందని, సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని చెప్పారు.

English summary
TRS MP Kalvakuntla Kavitha on Friday fired at TDP president Chandrababu Naidu and leader Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X