Sharmila: షర్మిల కాంగ్రెస్‍లోకి వస్తే స్వాగతిస్తాం.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీంతో వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్ విలీనం చేసే అవకాశం ఉంది. ఆమె ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పార్టీ విలీన ప్రక్రియపై షర్మిల ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేశారు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండా నవ్వుతూనే ఉన్నారు. ఓపికగా ఉండాలని చెప్పారు.
ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం ఢిల్లీ నుంచి వైఎస్ షర్మిలతో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా అని రిపోర్టర్లు కోమటిరెడ్డిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని అన్నారు. కాబట్టి ఆయన కూతురు పార్టీలోకి వస్తానంటే కచ్చితంగా స్వాగతిస్తామని తెలిపారు. చెల్లమ్మ షర్మిల, తాను ఒకే ఫ్లైట్ లో వచ్చామని..రాజకీయాలేవి మాట్లాడలేదని వెంకట్ రెడ్డి అన్నారు.

కాకపోతే కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం సంగతి షర్మిలను అడిగితేనే బాగుంటుందన్నారు. షర్మిల కూడా తన పార్టీ విలీనంపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. షర్మిల ఇప్పటికే కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అనేక సార్లు భేటీ అయ్యారు. శివకుమార్ షర్మిలకు, కాంగ్రెస్ మధ్య రాయబారిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. తన పార్టీ విలీనంపై వీరిద్దరితో తొలి దశ చర్చలు నిర్వహించారని తెలుస్తోంది.
ఈ వారంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను ఆమె తీసుకున్నట్టు సమాచారం. విలీనం అయ్యాక పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగనున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications