జై టిడిపి: నోరు జారిన ఎంపీ, ఈ చీరతో నేను తప్పు చేశానంటూ కవిత చురకలు
2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత అధికార తెరాసలో చేరిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు మల్లారెడ్డి మరో ఎంపీ కల్వకుంట్ల కవిత ముందు నాలుక జారారు.
హైదరాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత అధికార తెరాసలో చేరిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు మల్లారెడ్డి మరో ఎంపీ కల్వకుంట్ల కవిత ముందు నాలుక జారారు.

జై తెలుగుదేశం
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన జై తెలుగుదేశం అని నినదించారు. ఆ తర్వాత సర్దుకొని జై తెలంగాణ, జై కేసీఆర్ అని నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు.

తడబడ్డారు
మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్లారెడ్డి తొలుత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత తడబడ్డారు.

సర్దుకున్నారు
ఆయన జై తెలుగుదేశం అంటూ నినదించారు. విద్యార్థులు, వేదికపై ఉన్న వారు పకపకా నవ్వారు. దీంతో ఆయన సర్దుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ అంటూ ముగించారు.

పచ్చ వాసన పోలేదు.. నాది కూడా తప్పుకావొచ్చు..
మల్లారెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ కల్వకుంట్ల కవిత ఆ తర్వాత తన ప్రసంగంలో స్పందించారు. మల్లారెడ్డి అన్న దగ్గర ఒక్కటే విషయం ఉందని, ఆయన దగ్గర ఇంకా పాత పచ్చ జెండా వాసన పోవడం లేదని, అదొక్కటి తప్పితే మిగతా అంతా కూడా పింక్ జెండా బాట పట్టాడన్నారు. తనది కూడా తప్పు కావొచ్చునని, ఇవాళ పసుపు పచ్చ చీర కట్టుకొని వచ్చానని చమత్కరించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications