హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో మల్టీ విటమిన్ టాబ్లెట్ల కొరత, ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడిసిన్, విటమిన్ సీ, డీ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసుల గణనీయంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరం గురించి అయితే చెప్పక్కర్లేదు. పదుల సంఖ్య నుంచి వందలు, వేల వరకు పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే వైరస్ తగ్గి డిశ్చార్జ్ అయిన వారు.. కరోనా లక్షణాలు కనిపించినవారు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారు. దీంతో హైదరాబాద్ మహానగర మెడికల్ షాపుల్లో మల్టీ విటమన్ మాత్రల కొరత ఏర్పడింది. ముఖ్యంగా సీ, డీ విటమిన్ టాబ్లెట్లు కావాలని అడిగితే లేవు అని మందుల షాపు ఓనర్లు నిర్మొహమాటంగా చెబుతున్నారు.

 మాత్రల కొరత..

మాత్రల కొరత..

అపోలో ఫార్మాసీ సహా పలు ప్రధాన మెడికల్ షాపుల్లో టాబ్లెట్స్ దొరకడం లేదు. మల్టీ విటమన్ మాత్రలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో వైద్యుడి ప్రిస్కిప్షన్ కంపల్సరీ అని చెబుతున్నారు. ప్రిస్కిప్షన్ ఉంటేనే మాత్రలు ఇవ్వాలని యజమాన్యం స్పష్టంచేసిందని తెలిపారు. గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ తగ్గి డిశ్చార్జ్ అయినవారు.. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుకుంటున్న వారు రావడంతో మల్టీ విటమన్ మాత్రల కొరత ఏర్పడింది.

సోషల్ మీడియాలో షేర్..

సోషల్ మీడియాలో షేర్..

వైరస్ తగ్గి ఇంటికొచ్చిన కొందరు తాము తీసుకున్న డైట్, మాత్రలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో మిగతా వారు కూడా మల్టీ విటమన్ టాబ్లెట్ల కోసం ఎగబడుతున్నారు. కరోనా వైరస్ సోకిన రోగి విటమన్ సీ, విటమిన్ డీ మాత్రలను అందజేస్తారు. ఐదురోజులు హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకోవాలని సూచిస్తారు. ఒకవేళ రోగికి జ్వరం ఉంటే పారాసెటమాల్ విధిగా ఇస్తారు. విషయం తెలిసిన మిగతా వారు మల్టీ విటమిన్ మాత్రలను కొనుగోలు చేస్తున్నారు.

 విటమిన్ మందులు కూడా..

విటమిన్ మందులు కూడా..

వైరస్ లక్షణాలు కలిగి, హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ఆశ వర్కర్లు మందులను ఇస్తున్నారు. ఇందలో విటమన్ మాత్రలు కూడా ఉన్నాయి. కానీ మిగతా వారు మెడికల్ షాపుల్లో కూడా కొనుగోలు చేయడంతో కొరత ఏర్పడింది. హైదరాబాద్‌లో విటమిన్ టాబ్లెట్ల కొరత ఉంది అని ఇంద్రబాగ్ మెడికల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యుడు ఆనంద్ కుమార్ గౌడ్ తెలిపారు. గత కొంతకాలంగా సర్టేజ్ ఉంది అని.. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదన్నారు. ముఖ్యంగా విటమన్ సీ, విటమిన్ డీ మాత్రలకు మాత్రం భారీ డిమాండ్ పెరిగందని అంగీకరించారు.

ఇమ్యునిటీ హై..

ఇమ్యునిటీ హై..

మల్టీ విటమిన్ మాత్రలు రోగనిరోధక శక్తిని పెంచేందుకే మాత్రమే దోహదం చేస్తాయని, కరోనా వైరస్ కోసం కాదు అని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్‌కు మందు లేనందున, రోగిని బట్టి మందులను అందజేస్తున్నామని గాంధీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ శశిధర్ తెలిపారు. మల్టీ విటమిన్ మాత్రల్లో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని.. ఇవీ వారిలో రోగనిరోధక శక్తి పెంచుతుందని తెలిపారు.

నారింజ కంపల్సరీ

నారింజ కంపల్సరీ

రోగి లక్షణాలను బట్టి పారాసెటమాల్, హెడ్రాక్సిక్లోరోక్విన్, పారాసెటమాల్, అజిథ్రోమైసిన్ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఒకవేళ విటమిన్ మాత్రలకు బదులు నారింజ, నిమ్మకాయ, జామకాయ తీసుకోవాలని కోరుతున్నారు. కూరగాయలు, గుడ్లు, చికెన్ కూడా తీసుకోవాలని డాక్టర్ శశిధర్ కోరుతున్నారు.

English summary
multivitamin tablets: Medical shops in Hyderabad are seeing an unusual demand for multivitamin tablets as COVID-19 cases rise in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X