రేవంత్ సమర్ధతకు అసలు పరీక్ష, మారుతున్న లెక్కలు..!!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఈ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సీఎం రేవంత్ సమర్థతకు అసలైన పరీక్షగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నిక కావటంతో ఈ ఫలితాలు రేవంత్ తో సహా మంత్రుల రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎన్నికలను నిశితంగా గమనిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్.. బీజేపీ సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు ఈ ఎన్నికలే నాందిగా భావిస్తున్నాయి. అయితే.. క్షేత్ర స్థాయిలో మారుతున్న లెక్కలు ఆసక్తిని పెంచుతున్నాయి.
రేపు (బుధవారం) మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లను చివరి నిమిషం వరకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసారు. కొద్ది రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నే ఎక్కువ సీట్లు దక్కించుకున్నా కూడా ఇవి పార్టీ సింబల్ పై జరిగినవి కాకపోవటంతో ఎవరి క్లెయిమ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ కూడా పంచాయతీ ఎన్నికల్లో తామే మెజారిటీ స్థానాలు గెలిచామని ప్రచారం చేసుకుంది. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ తో జరుగుతాయి. బీజేపీ మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం గట్టిగానే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ కీలక ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీ లు, 7 కార్పొరేషన్లకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలు బ్యాలట్ విధానంలో జరుగుతున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 13 న వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవి అయినా కూడా సహజంగా అధికార పార్టీ కి కొంత సానుకూలత ఉంటుంది. అయితే, క్షేత్ర స్థాయిలో మాత్రం పబ్లిక్ మూడ్ ఏంటనేది రేపు తేలిపోనుంది.

రేవంత్ తో సహా మంత్రుల సమర్ధతకు పరీక్షగా
బీఆర్ఎస్ ఈ ఎన్నికల పైన భారీ ఆశలతో ఉంది. రేవంత్ హీమీల అమలులో విఫలం అయ్యారని.. కాంగ్రెస్ ను ఓడిస్తేనే పథకాలు అమలవుతాయని ప్రచారం చేసారు. అదే సమయంలో సీఎం రేవంత్ పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసారు. తన రెండేళ్ల పాలన చూసి ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. బీజేపీ స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ... బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రచారం చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది. అయితే.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకోకపోతే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించటానికి సొంత పార్టీ నాయకులే సిద్ధం అవ్వటం ఖాయం. ఇప్పటికే జిల్లాల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ బాధ్యతలు కేటాయించారు. దీంతో.. ఇప్పుడు ఈ పోలింగ్ సరళి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుది ఫలితాల పైన ఉత్కంఠ నెలకొంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications