ఉత్కంఠగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ .. అన్ని పార్టీలలో టెన్షన్.. గెలిచేది ఆ పార్టీనే!
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలలో లెక్కింపు ప్రారంభమైంది. 123 కేంద్రాలలో లెక్కింపు చేపట్టగా, మొదట పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తున్నారు. ఆపైన సాధారణ ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నారు. 144సెక్షన్ మధ్య పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన కౌంటింగ్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
అధికార కాంగ్రెస్ కు 80శాతం సీట్ల గెలుపు ధీమా
ఈరోజు మధ్యాహ్నానికి మున్సిపాలిటీలు, సాయంత్రానికి కార్పొరేషన్ ల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జిల్లా కలెక్టర్లతో పాటు, కౌంటింగ్ కేంద్రంలోకి కేవలం గుర్తింపుకార్డులు ఉన్న కౌంటింగ్ సూపర్వైజర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతి మాత్రమే అనుమతి ఇస్తారు.సెల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ డివైసెస్ ను లోనికి అనుమతించరు. ఇదిలా ఉంటే ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ 80శాతం సీట్ల గెలుపు ధీమాతో ఉంది.

అక్రమాలకు చెక్ పెట్టేలాగా ఈ తీర్పు
ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ కి అధికస్థానాలు దక్కుతాయని చెప్పడంతో కాంగ్రెస్ నేతల్లో ధీమా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని, అధికార పార్టీ అక్రమాలకు చెక్ పెట్టేలాగా ఈ తీర్పు ఉండబోతుందని బీఆర్ఎస్, బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మళ్లీ ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
ప్రధాన పార్టీల క్యాంప్ రాజకీయాలు
ఈ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా భవిష్యత్తు రాజకీయాలపైన ప్రభావాన్ని చూపిస్తాయని అన్ని రాజకీయ పార్టీలలోను అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు కౌంటింగ్ ప్రారంభానికి ముందు నుంచే క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. మేయర్, చైర్మన్ పీఠాలను లక్ష్యంగా చేసుకొని ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టాయి.












Click it and Unblock the Notifications