మునుగోడు ఉపఎన్నిక స్పెషన్ ఎట్రాక్షన్: పోటీకి గుర్రంపై వచ్చి నామినేషన్ వేసిన వీరభోగ వసంతరాయలు
మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లు వేయడానికి ఎవరికి వారు తమదైన శైలిలో వచ్చి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించి, నామినేషన్లను దాఖలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి వారు ధీటుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా, నామినేషన్ వేయడానికి కూడా మందీ, మార్బలంతో వెళ్లి తమ బలాన్ని చాటాలని ప్రయత్నించారు.

మునుగోడులో నామినేషన్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన వీరభోగ వసంతరాయలు
ఇక ఈసారి మునుగోడు ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు మొత్తం వంద మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున వందకుపైగా నామినేషన్ లు దాఖలు కాగా ఇందులో ఎక్కువ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మునుగోడులో 141 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇక నేడు, రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల పర్వం చివరి రోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థులు కొందరు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అందులో వీర భోగ వసంత రాయలు ఒకరు.

గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన వైద్యుడు
మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి నాంపల్లి మండలం కుమ్మరిగూడెం కు చెందిన డాక్టర్ వీర భోగ వసంత రాయలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి గుర్రంపై వచ్చారు. వృత్తి రీత్యా వైద్యుడైన ఆయన హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్లో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బీసీ ఓట్లు ఉన్నప్పటికీ బీసీలకు టికెట్లు ఇవ్వకపోవటం బాధాకరం
నియోజకవర్గంలో అత్యధికంగా బిసి ఓట్లు ఉన్నప్పటికీ బీసీలకు టికెట్లు ఇవ్వకపోవటం బాధాకరమని, తెలుగు రాష్ట్రాలలో కుమ్మరి కులానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో, తమ కులస్తులను ప్రభుత్వాలు గుర్తించాలన్న ఉద్దేశంతో గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్న ఆయన, మంత్రిగా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బీసీలకు అవకాశం ఇవ్వలేదని నామినేషన్ దాఖలు చేసిన వీర భోగ వసంత రాయలు
కేవలం ఎన్నికలు ఉన్నచోటనే చేస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు అవకాశం ఇవ్వలేదు కాబట్టే తాను నామినేషన్ వేశానని పేర్కొన్నారు. మొత్తానికి వీర భోగ వసంత రాయలు మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేయడానికి గుర్రం పైన రావడం మాత్రం నియోజకవర్గంలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications