జూబ్లీహిల్స్‌లో రూ. 90 లక్షల నగదు సీజ్: బీజేపీ ఎమ్మెల్యే పీఏ డ్రైవర్ అరెస్ట్

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు కొందరు ప్రలోభాలకు తెరలేపుతున్నారు.

తాజాగా, జూబ్లీహిల్స్‌లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ. 89.91 లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందించిన సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో దాడులు నిర్వహించారు.

Munugode bypoll: 90 lakh cash seized in Jubilee Hills in Hyderabad, one arrested

ఈ క్రమంలో ఓ కారులో తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని కడారి శ్రీనివాస్‌గా గుర్తించారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పీఏ జనార్ధన్ కారు డ్రైవర్‌గా తేల్చారు.

నగదును జూబ్లీహిల్స్‌లోని త్రిపుర కన్ స్ట్రక్చన్ కంపెనీ నుంచి మునుగోడు తరలిస్తున్న క్రమంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కారు, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్‌ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారిస్తున్నారు. మరికొన్ని వాహనాల వివరాలు కూడా వెల్లడించినట్లు సమాచారం.

కాగా, మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా పలు వాహనాల్లో భారీగా డబ్బు దొరుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+