మునుగోడు సర్వే రిపోర్ట్స్ తో పార్టీలకు మైండ్ బ్లాక్ - గ్రౌండ్ రియాల్టీ ఏంటి..!!

మునుగోడులో గెలిచేదెవరు. ఏ పార్టీది ఏ స్థానం. ఇప్పుడు తెలంగాణే ఇదే పెద్ద డిబేట్. ఇప్పటికే మునుగోడులో గెలిచేదెవరనే అంశం పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో రంగంలోకి దిగిన సర్వే సంస్థలు చెబుతున్న అంశాలతో పార్టీలు షాక్ అవుతున్నాయి. సర్వే నివేదికలు భిన్నంగా ఉన్నా.. గెలుపు కంటే ముందుగా పార్టీలకు అందుతున్న గ్రౌండ్ రిపోర్టు మాత్రం నిద్ర లేకుండా చేస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలు గెలిచేందుకు శక్త వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.

అయితే, నియోజకవర్గంలో దాదాపు 4 శాతం ఓట్లు కీలకంగా మారబోతున్నాయని సర్వే సంస్థలు తేల్చాయి. అవి ఎవరికి అనుకూలంగా మారుతాయనేది పోలింగ్ సమయంలోనే స్పష్టత రానుంది. రెండు ప్రధాన పార్టీల మధ్య గెలుపు - ఓటముల తేడా కూడా 4.5 శాతంగా ఉండటం మరింత ఉత్కంఠను పెంచుతోంది. రెండు జాతీయ పార్టీల మధ్య ఓట్ షేరింగ్ తేడా 6 శాతంగా ఒక సర్వే సంస్థ తేల్చింది. 18-30 ఏళ్ల వరకు ఉన్న యువత జాతీయ పార్టీ వైపు అనుకూలంగా ఉన్నట్లుగా సర్వేలో స్పష్టం చేసారు. 45 ఏళ్ల వయసు పైబడిన వారు మాత్రం స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో రాష్ట్రంలో అధికార పార్టీ ఆ ఓట్ బ్యాక్ పైనే ఆశలు పెంచుకుంటోంది. మహిళల ఓట్లు ఈ సారి కీలకంగా మారబోతున్నాయి.

Munugode Surveys: Its tight fight between TRS and BJP, to which party congress voting will become a boon-Check here

కాంగ్రెస్ నుంచి మహిళా అభ్యర్ది బరిలో ఉండటంతో పాటుగా కొన్ని అంశాలు సెంటిమెంట్ తో పాటుగా వర్కవుట్ అయ్యే అవకాశం ఉందని మరో సర్వే సంస్థ అభిప్రాయ పడింది. వామపక్షాల మద్దతు టీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశంగా సర్వే సంస్థలు తేల్చాయి. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో వివాదం ద్వారా.. వారికి మద్దతుగా ఉన్న ఓట బ్యాంకు పైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మరో సంస్థ పేర్కొంది. రాజగోపాల్ కాంట్రాక్టు కోసమే పార్టీ వీడారనే ప్రచారం గ్రామీణ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని తేల్చిన సర్వే సంస్థలు.. యువతను ఆకట్టుకోవటం లేదని తేల్చింది. అన్నింటి కంటే ఓటింగ్ శాతం మునుగోడు ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించనుంది.

టీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలు అసలు బీజేపీ తమ రెండు పార్టీల తరువాత స్థానంలో ఉందని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు సైతం ఇదే విషయాన్ని పెద్ద ఎత్తన ప్రచారంలోకి తీసుకొచ్చారు. కానీ, బీజేపీ మాత్రం అభ్యర్ధి కోమటిరెడ్డి ప్రాబల్యం మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పట్టున్న ప్రాంతమే అయినా, పార్టీ మార్పు విషయంలో ఎంత వరకు రాజగోపాల్ వాదనకు ఓటర్లు మద్దతుగా నిలుస్తారేది కీలకం. ఇన్న రకాల సమీకరాలు - లెక్కల నడుమ మునుగోడు ఉప ఎన్నిక మరింతగా ఉత్కంఠను పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+