ఇంటర్ విద్యార్ధి ఘాతుకం: మహిళపై లైంగిక దాడి, ఆపై హత్య
హైదరాబాద్: నూర్‌ఖాన్ బజార్ బాల్ శెట్టికేత్‌లో జరిగిన మహిళపై లైంగిక దాడి, హత్య కేసను డబీర్ పూరా పోలీసులు చేధించారు. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మీర్ చౌక్ డివిజన్ ఏసీపీ ఎం.శ్రీనివాసరావు, డబీర్ పురా ఇన్‌స్పెక్టర్ మట్టయ్య, అదనపు ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుమార్‌తో కలిసి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నూర్‌ఖాన్‌బజార్ బాల్‌శెట్టికేత్ ప్రాంతానికి చెందిన జీనత్ అలియాస్ జకియా ఫాతిమా (36) కోఠిలోని రూప్ సంఘం వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్. భర్త చనిపోవడంతో ఒంటరిగా నివాసం ఉంటోంది. మోసీన్ అనే బాయ్ ప్రెండ్ తరచూ ఈమె ఇంటికి వచ్చిపోయేవాడు.
ఇదిలా ఉండగా పురానీవేలి జహేరా మంజీల్ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్ధి మీర్జా జీషాన్ అలీ ఖాన్ (19) గతేడాది నవంబర్ 3న ఉదయం 6 గంటలకు జీనత్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నివాసముండే తన తాత మీర్జా అబేద్ అలీ ఖాన్ వద్దకు వచ్చాడు.

జీనత్ ఇంటిలో చోరీ చేసేందుకు తెరిచి ఉన్న కిటికీలోంచి ప్రవేశించాడు. విలువైన వస్తువులు తీస్తుండగా.. నిద్రలో ఉన్న జీనత్ మేల్కొని గట్టిగా అరవబోగా, ఆమె నోరు మూసి కిందపడేశాడు. తర్వాత తలను గోడ కేసి కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం గొంతు నులిమి చంపేశాడు.
మృతురాలి సెల్‌ఫోన్ తీసుకొని ఏమీ తెలియనట్టు తన తాత ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం 10 గంటలకు జీనత్ బాయ్ ప్రెండ్ మోసీన్ ఆమెను వస్త్ర దుకాణానికి తీసుకెళ్లేందుకు రాగా జీనత్ చనిపోయి ఉంది. తన సోదరుడితో కలిసి అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, జీషాన్ ఘటనా స్థలం నుంచి ఎత్తుకెళ్లిన మృతురాలి సెల్‌ఫోన్ ఆధారంగా అతడే నిందితుడిగా గుర్తించి నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్సై కేఎస్ రవి బృందం అతడిని అరెస్ట్ చేసింది. ఐపీసీ 302, 380, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications