హెచ్చరికలు లేకుండా మూసీ గేట్లు ఎత్తివేత: వరదలో చిక్కుకున్న కాపర్లు, 20 గేదెలు గల్లంతు
హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కారణంగా 20 గేదెలు వరద నీటిలో కొట్టుకుపోగా.. పలువురు కాపర్లు వరదలో చిక్కుకుపోయారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు గేట్లు తెరవడంతో ఒక్కసారిగా నీరు చుట్టుముట్టింది. దీంతో వరద మధ్యలోనే పశువుల కాపర్లు చిక్కుకున్నారు. మరోవైపు, 20 వరకు గేదెలు వరదలో కొట్టుకుపోయాయి.
కేతపల్లి మండలం భీమారం గ్రామంలోని మూసీ నదిలోకి ఒక్కసారిగా వరద రావడంతో ఓ ట్రాక్టర్ కూడా కొట్టుకుపోయింది. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్న పశువుల కాపర్లను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన నల్గొండ డీఎస్పీ శివరామ్ రెడ్డి ఘటనా స్థలానికి హుటాహుటిన సిబ్బందిని పంపించారు.

వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన పశువుల కాపర్లను జేసీబీ సాయంతో బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి వరదనీటిని వదలడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలో గేదెలు, ట్రాక్టర్ కొట్టుకుపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద రావడంతోనే మూసీ ప్రాజెక్టు అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని కిందికి వదిలినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మహాబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల భారీ వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
కాగా, సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ సూచించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, సూర్యాపేట, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. వర్షాల దృష్యా ఎవరూ బయటకు రావొద్దని, అత్యవసరమైతేనే రావాలని సూచించింది.
బంగళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం వాయువ్య పరిసర పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
MRO అధికారాలు, నెల జీతం ఎంతో తెలుసా..? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications