Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బచ్చాగానివి.. వుమెనైజర్‌వి... నీ అరాచకాలన్నీ బయటపెడుతా.. : బండి సంజయ్‌పై మైనంపల్లి సంచలనం

స్వాతంత్య్ర దినోత్సవం వేళ మల్కాజ్‌గిరిలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పెద్ద యుద్ధమే రాజుకుంది. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఇరు వర్గాల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తుండగా... దాడి జరగలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెబుతున్నారు. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బండి సంజయ్... మైనంపల్లిపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో మైనంపల్లి అంతకంటే రెట్టింపు పరుష పదజాలంతో బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. ఇప్పటినుంచి బండి సంజయ్ భరతం పడతానని హెచ్చరించారు.

నన్ను రెచ్చగొట్టినవ్... : మైనంపల్లి

నన్ను రెచ్చగొట్టినవ్... : మైనంపల్లి

'నీకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. ఏ పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం.నిన్ను గాడిద మీద ఎక్కించి గుండు కొట్టి తిప్పేదాకా నిద్రపోడు మైనంపల్లి. నీ చుట్టు ఉన్నవాళ్లంతా కబ్జాదారులే... నాలాల మీద ఫంక్షన్ హాల్స్ కట్టారు.రేపటి నుంచి అక్రమంగా నిర్మించిన గోదాములు,ఫంక్షన్ హాళ్ల ఎదుట ధర్నా చేస్తా. వాటిని కూలగొట్టేదాకా వదలను. ఒకసారి ఎమ్మెల్సీ,నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.నేనెప్పుడూ ఇంతలా మాట్లాడలే... నన్ను రెచ్చిగొట్టినవ్... మొత్తం జిల్లాలు కదలి వస్తాయ్...' అని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో బీజేపీ కార్పోరేటర్ శ్రవణే గాంధీ బొమ్మను పగలగొట్టి రాద్దాంతం చేశాడని ఆరోపించారు. అతనో సైకో అని విమర్శించిన మైనంపల్లి... ఇంతకుముందు చాలామందిని కొట్టాడని ఆరోపించారు. బండి సంజయ్‌కి దమ్ముంటే తన ముందుకొచ్చి ఆరోపణలు చేయాలని సవాల్ విసిరారు.

నువ్వొక వుమెనైజర్... : మైనంపల్లి

నువ్వొక వుమెనైజర్... : మైనంపల్లి

'నీది కార్పోరేటర్ స్థాయి.. కార్పోరేటర్లపై కూడా నాకు గౌరవం ఉంటుంది... నీకు బీజేపీ స్టేట్ ప్రెసిడ్ంట్ ఇచ్చారు... అది ప్రూవ్ చేసుకో... ఇక్కడికొచ్చి ఎన్విరాన్‌మెంట్ మొత్తం స్పాయిల్ చేశావు. మల్కాజ్‌గిరిలో ప్రశాంతత ఉండాలనేది మైనంపల్లి ఆకాంక్ష. ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా... నువ్వొక వుమెనైజర్‌... నీ అరాచకాలన్నీ బయటపెడుతా... అసలు కామన్ సెన్స్ ఉందా నీకు.. గుండు పగలగొట్టేస్తా... నేను పిలిస్తే జిల్లాల నుంచి లక్షల మంది తరలిస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు టీఆర్ఎస్,బీజేపీ కొట్టుకుంటే కాంప్రమైజ్ చేశా... నువ్వెంత నీ బతుకెంత... బచ్చాగానివి... నీవన్నీ బయటకు తీస్తా. నేను కష్టపడి పైకొచ్చా... నాదేంది నువ్వు బయటపెట్టేది... దేనికంటే దానికి సిద్ధం. వరదల సహాయక చర్యల్లో తిరిగినప్పుడు నువ్వెక్కడున్నావ్. దమ్ముంటే రా... ఏ చౌరస్తాకు రమ్మంటే అక్కడికి వస్తా....' అని మైనంపల్లి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా....: మైనంపల్లి

ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా....: మైనంపల్లి

'నీ దగ్గరికి నేనొచ్చానా... నాకు కులం,మతం ఫీలింగ్ లేదు... నన్ను రెచ్చగొట్టారు కాబట్టి నిన్ను నిద్రపోనివ్వను. నువ్వు ఎంపీగా ఓడిపోయేదాకా నీ వెనుక పడుతా. ఒకసారి ఎంపీగా గెలిచినందుకే అంత రెచ్చిపోతే... నేనెంత రెచ్చిపోవాలి. రా.. మైనంపల్లి అంటే ఏందో చూపిస్తా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చావని కార్పోరేటర్లే నాతో చెప్పారు.సత్తా ఉంటే రా... ఎక్కడికి అంటే అక్కడికి వస్తా.. నేనూ,నా కార్యకర్తలు చాలు నీకు.' అని మైనంపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు,ఆరోపణలు చేశారు.

మైనంపల్లిపై బండి సంజయ్ ఎటాక్‌...

మైనంపల్లిపై బండి సంజయ్ ఎటాక్‌...

అంతకుముందు,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్పోరేటర్‌ను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యూస్‌లెస్ ఫెలో గూండాయిజం చేయడానికేనా నువ్వు ఎన్నికైందని మైనంపల్లిపై ఫైర్ అయ్యారు. గతంలో మైనంపల్లి బీజేపీలో వచ్చి చేరుతానని తన చుట్టూ తిరిగాడన్నారు. కానీ లుచ్చా రాజకీయాలు చేస్తున్నాడు... ప్రజలను ఇబ్బందిపెడుతున్నాడని పార్టీలో చేర్చుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వచ్చి బతిమాలితే టీఆర్ఎస్‌లో చేరినట్లు చెప్పుకుంటున్నాడని అన్నారు. ఈ క్రమంలో ఆయన కొంత పరుష పదజాలంతో మైనంపల్లిపై విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా వారు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. ఇదే పాలసీని అవలంభిస్తే తాము కూడా మొదలుపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో టీఆర్ఎస్ నాయకులు జాతీయ గీతాన్ని ఆలపించలేదని.. బాబా సాహెబ్ అంబేడ్కర్,గాంధీ ఫోటోలను అవమానించారని ఆరోపించారు.ఈ ఘటనపై డీజీపీ,కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

Recommended Video

    Spl Mock Live On Schools Open From Pragathi Bhavan || Oneindia Telugu
    ఆ వివాదమే కారణం..

    ఆ వివాదమే కారణం..

    మల్కాజ్‌గిరిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక టీఆర్ఎస్,బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అయితే జాతీయ జెండాలో భరతమాత ఫోటో ఉండటంపై వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా అది ఘర్షణకు దారితీసింది. టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్లతో దాడి చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన కార్పోరేటర్ శ్రవణ్ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌ ఆస్పత్రికి వెళ్లి శ్రవణ్‌ను పరామర్శించడం... మైనంపల్లిపై విరుచుకుపడటం జరిగాయి. దీనికి మైనంపల్లి మరింత తీవ్రంగా రెచ్చిపోయి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+