విడాకులకు అప్లై చేసిన నిహారిక
హైదరాబాద్: ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె కుమార్తె నిహారిక కొణిదెల విడాకులు తీసుకోబోతోన్నారు. తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు కావాలంటూ దరఖాస్తు దాఖలు చేసుకున్నారు. దీనితో నిహారిక- చైతన్య జొన్నలగడ్డ దాంపత్య జీవితానికి బ్రేకులు పడినట్టయింది. ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
నిహారిక- చైతన్య వివాహం 2020 డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గల ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లి వేడుకలకు హాజరైంది. బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. నిహారిక- చైతన్య వివాహం ఎంతోకాలం మనుగడ సాగించలేకపోయింది. నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే విడాకుల వరకు వెళ్లింది.

నిహారిక భర్తతో విడిపోయిందంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఆ ప్రచారాన్ని బలపరిచేలా నిహారిక- చైతన్య కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు విడాకుల పత్రాలను దాఖలు చేశారు. ఇప్పటికే వారిద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి ఫొటోలను డిలెట్ చేసుకున్నారు. అప్పుడే ఈ జంట విడిపోతోందనే వార్తలు తెరమీదికి వచ్చాయి.
తమ కుటుంబంలో జరిగే శుభ కార్యాలకు కూడా నిహారిక ఒంటరిగానే హాజరు కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇటీవలే తన సోదరుడు, నటుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌కూ నిహారిక ఒంటరిగా హాజరు కావడం కనిపించింది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు చైతన్య జొన్నలగడ్డ దూరంగా ఉన్నారు. మనస్పర్థలు రావడం వల్లే కలిసి జీవించలేమనే నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు.














Click it and Unblock the Notifications