కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఆ పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కౌంటర్‌ను కొండా సురేఖ తరపు న్యాయవాది గురుప్రీత్ సింగ్ దాఖలు చేశారు.

మరోవైపు, నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. వాదనల సందర్భంగా నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆ తర్వాత ఎక్స్‌లో క్షమాపణ కోరుతూ పోస్టు పెట్టారన్నారు.

Nagarjuna s lawyer comments on minister Konda Surekha in court

ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా కొండా సురేఖ క్రిమిన్ చర్యలకు అర్హురాలు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది తెలిపారు.

నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆయన కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. కొండ సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున అడ్వకేట్ అన్నారు. దీంతో తనపై నాగార్జున వేసిన పరువు నష్టం దావా పిటిషన్ కు నాంపల్లి స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు కొండా సురేఖ.

కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే నాగార్జునకు మాజీ మంత్రి కేటీఆర్ ఓ కండిషన్ పెట్టారని.. అందుకే నాగచైతన్య, సమంత మధ్య విడాకులు జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతొ కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడ్డారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సమంత, ఎన్టీఆర్ వంటి స్టార్స్ కొండా సురేఖ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.అయితే, అంతకుముందు తన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా సమంతకు క్షమాపణలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+