బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీ గుడ్ బై - కాంగ్రెస్ లోకి ఎంట్రీ, ఆట మొదలు..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నేతలు అప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పుడు ఎంపీ సీట్ల పైన ఫోకస్ పెరిగింది. బీఆర్ఎస్ సిట్టింగ్ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి కొంత మంది నేతలు సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త లెక్కలు:బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమితో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు స్పష్టం అవుతోంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో..ముందుగా కొందరు నేతలు తమ భవిష్యత్ కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు అనుచరులతో మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారంలోగా ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు రాములు తన నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు.

సిట్టింగ్ ఎంపీ గుడ్ బై:తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో రేవంత్ టీడీపీలో ఉన్న సమయంలో కలిసి పని చేసిన ఎంపీ రాములు..ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు. ఎంపీ రాములు తెలుగుదేశంలో సుదీర్ఘ కాలం పని చేసారు. చంద్రబాబు ప్రభుత్వంలో క్రీడలు, యువజన సేవల శాఖామంత్రిగా పనిచేశారు. తరువాత బీఆర్ఎస్ లో చేరిన రాములు 2019 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే, నాగర్ కర్నూలు జడ్పీ ఛైర్ పర్సన్ ఎన్నిక వ్యవహారంలో అధిష్ఠానం తన వాదనను పట్టించుకోకపోవటంతో మనస్థాపానికి గురైన రాములు పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లోకి రాములు..!:అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ మాటలు నమ్మి తన కుమారుడికి జడ్పీ ఛైర్ పర్సన్ దక్కకుండా చేసారని రాములు భావిస్తున్నారు. పార్టీ మార్పు పైన ఇప్పటికే అనుచర వర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ లో సీఎం పదవిపైన స్పష్టత..మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తరువాత రాములు పార్టీ మారాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే, నాగర్ కర్నూలు ఎంపీ సీటు పైన ఇప్పటికే కాంగ్రెస్ నేత మల్లు రవికి హామీ ఇచ్చారు. గతంలో మల్లు రవి పైనే రాములు విజయం సాధించారు. దీంతో..రాములు కాంగ్రెస్ లో చేరినా..ఎంపీ సీటు పైన హామీ దక్కుతుందా లేదా అనేది చూడాలి. నల్గొండ జిల్లాలోని మాజీ ఎంపీ సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications