హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'పోలీస్' అభ్యర్ధులకు శుభవార్త: 5కే రన్‌ను రద్దు చేసే యోచనలో టీ సర్కార్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సచివాలయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల భర్తీలో వయోపరిమతి పెంపుపై ఈ సమావేశంలో చర్చించారు.

అంతేకాదు త్వరలో మొదలుకానున్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో 5కే ర‌న్‌ను తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు హోం మంత్రి నాయిని నేతృత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం 5కే రన్ ను తొలగించాలని ప్రతిపాదించింది.

Naini narasimha reddy review on age limit for police jobs

త్వరంలో తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు జరగనున్నాయి. కానిస్టేబుల్ పోస్టును దక్కించుకోవాలంటే ఐదు వేల కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఈ క్రమంలో కొంత మంది అభ్యర్ధులు స్పృహ తప్పి ఆసుపత్రి పాలైన సంఘటన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీనిపై త్వరలో జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఉగ్రవాదులు, తీవ్రవాదుల దాడుల్లో నష్టపోయిన వారికి పరిహారం పెంపుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, డీజీపీ ఉన్నతాధికారుుల హాజరయ్యారు.

English summary
Naini narasimha reddy review on age limit for police jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X