నిత్యపెళ్లి కొడుకు అరెస్ట్: 19 మంది మహిళలను మోసం చేసిన శామ్యూల్ అరెస్ట్
నల్గొండ: ఇటీవల నిత్య పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్ల బాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. ఏకంగా 19 మంది మహిళలతో పెళ్లి చేసుకుని, వారి జీవితాలతో ఆడుకున్నాడు. చివరకు ఆ పాపాలు పండటంతో కటకటాలపాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ చర్చిలో పియానో వాయిస్తుంటాడు నిందితుడు శామ్యూల్ విలియమ్స్(45). ఈ క్రమంలోనే అనేక మంది మహిళ లను ట్రాప్ చేశాడు. చర్చికి వచ్చే మహిళలు, యువతులను లోబర్చుకున్నాడు. విలియమ్స్ ఉచ్చులో 19 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో.. ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది.

చర్చికి వచ్చే మహిళలపై విలియమ్స్ కన్ను పడింది. పియానో వాయిస్తూ వారిని ఆకట్టుకుంటాడు. అలా ఏకంగా 19 మందిని మోసం చేశాడు. కొంతమందిని పెళ్లి చేసుకున్నాడు. వారిని లోబర్చుకుని తన కోరికలు తీర్చుకునేవాడు ఈ కామాంధుడు. వారు అంగీకరించకుంటే బెదిరించి అఘాయిత్యానికి పాల్పడేవాడు.
ఈ విషయం తెలిసిన తనూజ నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక, తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెల్సుకుని గుండె పోటు వచ్చిందని ఆస్పత్రిలో చేరాడు విలయమ్స్. అయితే, పోలీసులు ఆస్పత్రి నుంచి విలియమ్స్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విలియమ్స్.. నార్కెట్‌పల్లిలో ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్న శ్యామ్యూల్...












Click it and Unblock the Notifications