వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ పోటీ చేసినా గెలుపు నాదే, రాజకీయాల నుండి తప్పుకొంటా: కోమటిరెడ్డి సంచలనం

నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కెసిఆర్ పోటీ చేసినా తాను 40 నుండి 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కెసిఆర్ పోటీ చేసినా తాను 40 నుండి 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లేకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆసక్తికరం:'అన్నా మంత్రి పదవి కోసం బాధ పెట్టుకొన్నావా'? 'మా పార్టీలోకి ఎప్పుడొస్తున్నావు'?ఆసక్తికరం:'అన్నా మంత్రి పదవి కోసం బాధ పెట్టుకొన్నావా'? 'మా పార్టీలోకి ఎప్పుడొస్తున్నావు'?

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ తరుణంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీలు, నేతల బలబలాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకొంటున్నాయి.

'ఓడిపోతే ఎలా తిరుగుతా, ఆయనకు అంత సీన్‌లేదు''ఓడిపోతే ఎలా తిరుగుతా, ఆయనకు అంత సీన్‌లేదు'

ఇందులో భాగంగానే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ మార్పులు చేర్పులు సంభవించాయి. కంచర్ల భూపాల్‌రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.దీంతో టిఆర్ఎస్ నల్గొండ అసెంబ్లీ ఇంచార్జీ పదవిని కంచర్ల భూపాల్‌రెడ్డికి ఆ పార్టీ కట్టబెట్టింది.

కంచర్లకే నల్గొండ టిఆర్ఎస్ టిక్కెట్టు: దుబ్బాకకు కార్పోరేషన్ ఛైర్మెన్, కోమటిరెడ్డికి ఇబ్బందేనా?కంచర్లకే నల్గొండ టిఆర్ఎస్ టిక్కెట్టు: దుబ్బాకకు కార్పోరేషన్ ఛైర్మెన్, కోమటిరెడ్డికి ఇబ్బందేనా?

 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలనం

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలనం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి తాను బరిలోకి దిగి విజయం సాధిస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. తనపై కెసిఆర్ పోటీచేసినా కానీ ఓడిపోవడం ఖాయమనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన చెప్పారు.ఒకవేళ తాను ఓటమిపాలైతే రాజకీయాల నుండి తప్పుకొంటానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారిద్దరు కలిశారు: ''సుఖేందర్‌రెడ్డే నా గురువు, కానీ, కోమటిరెడ్డిపై వ్యతిరేకతతోనే చేరలేదు''వారిద్దరు కలిశారు: ''సుఖేందర్‌రెడ్డే నా గురువు, కానీ, కోమటిరెడ్డిపై వ్యతిరేకతతోనే చేరలేదు''

 కంచర్లను టిఆర్ఎస్‌ను రంగంలోకి దించింది

కంచర్లను టిఆర్ఎస్‌ను రంగంలోకి దించింది

కంచర్ల భూపాల్‌రెడ్డిని టిఆర్ఎస్‌ను రంగంలోకి దించింది. భూపాల్‌రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. అయితే నల్గొండ అసెంబ్లీ టిఆర్ఎస్ ఇంచార్జీగా ఉన్న దుబ్బాక నర్సింహ్మరెడ్డిని తప్పించి కంచర్ల భూపాల్‌రెడ్డిని రంగంలోకి దించింది టిఆర్ఎస్. 2014 ఎన్నికల్లో కంచర్ల భూపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కంచర్ల భూపాల్‌రెడ్డిపై విజయం సాధించారు.దీంతో కంచర్ల భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరగానే ఆయనకు టిఆర్ఎస్ ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు.

 కోమటిరెడ్డిని ఓడించే లక్ష్యం

కోమటిరెడ్డిని ఓడించే లక్ష్యం

నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ పావులు కదుపుతోంది. టిఆర్ఎస్‌కు కోమటిరెడ్డి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఇటీవల కాలంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గీయులకు టిఆర్ఎస్ వర్గీయులకు మధ్య గొడవలు జరిగాయి.కోమటిరెడ్డిని ఓడించాలనే వ్యూహంతో టిఆర్ఎస్ నాయకత్వం పావులు కదుపుతోంది.ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌లో కంచర్ల భూపాల్‌రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వనించింది.

 1999 నుండి కోమటిరెడ్డి విజయం

1999 నుండి కోమటిరెడ్డి విజయం

నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. 1999 ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి నంద్యాల నర్సింహ్మరెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సుమారు 4వేల ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలు కోమటిరెడ్డికి కలిసివచ్చాయి. ఆ సమయంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి టిడిపి నుండి కాంగ్రెస్‌లో చేరడం కోమటిరెడ్డికి కలిసివచ్చిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Nalgonda MLA Komatireddy venkat Reddy sensational comments on Thursday.Komatireddy Venkat Reddy chit chat with media at Assembly lobby.If Kcr contest from Nalgonda segment in 2019 elections I will win said Komatireddy Venkat reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X