కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాంపల్లి కోర్టులో భానుకిరణ్‌కు ఊరట: దౌర్జన్యం కేసు కొట్టివేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హంద్రీనీవా గుత్తేదారులపై దౌర్జన్యం కేసులో భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో భానుకిరణ్ సహా మంగళికృష్ణ, మధు, నాని, నీల శ్రీనివాసన్‌పై నమోదైన కేసులను కోర్టు మంగళవారం కొట్టివేసింది.

గుత్తేదారులను బెదిరించి రూ. 3 కోట్లు వసూలు చేశారని సిఐడి గతంలో వీరిపై కేసు నమోదు చేసింది. దీనిపై విచారనించిన కోర్టు నిందితులపై సరైన ఆధారాలు లేవని నిర్ధారిస్తూ కేసు కొట్టివేసింది. కాగా, మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భానుకిరణ్ ఉన్న విషయం తెలిసిందే.

గుడి చందా ఇవ్వలేదని సాంఘిక బహిష్కరణ

Nampally Court cancelled Bhanu Kiran's case

గ్రామంలో నిర్మించతలపెట్టిన ఆలయ నిర్మాణానికి చందా ఇవ్వలేమని చెప్పినందుకు ఓ కుటుంబంపై సామాజిక బహిష్కరణ విధించారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామంలో గంగామాత ఆలయం నిర్మించాలని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) నిర్ణయించింది. కుటుంబానికి రూ.500 చొప్పున నిర్మాణ ఖర్చులకు గాను చందాగా ప్రకటించి, ఆమేరకు అందరూ ఇవ్వాలని కోరింది. అయితే, గ్రామంలోని విశ్వబ్రాహ్మణ, మాల, పద్మశాలీ కులస్తులు తాము అంత చందా ఇచ్చుకోలేమని వీడీసీ పెద్దలకు చెప్పారు.

దీంతో ఆయా కులస్తులను సాంఘికంగా బహిష్కరిస్తున్నట్లు పెద్దలు ప్రకటించారు. వారితో మిగతా వారు ఎటువంటి లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవటాలు చేయరాదని హుకుం జారీ చేశారు. ఈ పరిణామంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.

English summary
Nampally Court cancelled a case of Bhanu Kiran on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X