అమరావతి చరిత్రపై సినిమా: కెసిఆర్‌ను కలిసిన బాలకృష్ణ
హైదరాబాద్: నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. తన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ముహూర్తపు సన్నివేశానికి రావాలని కెసిఆర్‌ను కోరారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కెసిఆర్‌కు ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు బాలకృష్ణ వచ్చారు.
అమరావతి చరిత్ర, అమరావతి రాజధానిగా శాతవాహన చక్రవర్తుల పరిపాలనపై బాలకృష్ణ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ఉగాది పర్వదినం రోజున అమరావతిలో ప్రకటించారు.
ఈ సినిమాకు 22వ తేదీన పూజా కార్యక్రమాలు నిర్వహించి, షూటింగ్ ప్రారంభించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కెసిఆర్‌ను బాలకృష్ణ ఆహ్వానిస్తున్నారు.

కెసిఆర్‌ను కలిసిన బాలకృష్ణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి ఆహ్వాన పత్రం ఇస్తున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

అమరావతి చరిత్ర: కెసిఆర్‌ను పిలిచి, చూపించారు! (పిక్చర్స్)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి ఆహ్వాన పత్రం ఇస్తున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. పక్కన డైరెక్టర్ క్రిష్.

కెసిఆర్‌ను కలిసిన బాలకృష్ణ
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆహ్వాన పత్రం ఇవ్వగా.. దానిని చదువుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

బాలకృష్ణ, క్రిష్
అమరావతి చరిత్ర, అమరావతి రాజధానిగా శాతవాహన చక్రవర్తుల పరిపాలనపై బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications