హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాడీవేడి భేటీ: రేవంత్-మోత్కుపల్లి తీవ్ర వాగ్వాదం, వాకౌట్, లోకేష్ ఎంక్వైరీ

కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తనను వ్యతిరేకించే వారితోనే భేటీలవుతూ వారికి తన చేరికపై వివరిస్తుండటం గమనార్హం. అదే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తనను వ్యతిరేకించే వారితోనే భేటీలవుతూ వారికి తన చేరికపై వివరిస్తుండటం గమనార్హం. అదే సమయంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ టీడీపీ కీలక సమావేశానికి కూడా రేవంత్ హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రేవంత్‌ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీపీ నేతలు శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి రేవంత్‌ హాజరుకావడంతో టీడీపీ నేతలు, శ్రేణుల్లో మరింత ఉత్కంఠ ఏర్పడింది.

రేవంతే ప్రధాన ఎజెండా..

రేవంతే ప్రధాన ఎజెండా..

ఈ ప్రత్యేక భేటీలో ప్రధాన అజెండాగా రేవంత్‌ పార్టీ మార్పుపైనే చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీకి రేవంత్ హాజరుకాలేరని కొందరు నేతలు భావించినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా రేవంత్ రావడంతో అతనికి అనుకూల, వ్యతిరేక వర్గాల నేతలు ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. అయితే, ఈ సమావేశంలో రేవంత్ పార్టీని వీడటంపై మాత్రం స్పష్టత రాకపోవడం గమనార్హం.

రేవంత్ ఆగ్రహం..

రేవంత్ ఆగ్రహం..

అయితే, పొత్తుల విషయంలో చంద్రబాబు అనుకూల నేతల తీరుపై రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏపీ టీడీపీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైనా.. పట్టించుకోకుండా తనను టార్గెట్ చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నన్ను జైల్లో పెట్టిన వ్యక్తి (కేసీఆర్‌)తో మీరు ఎలా అంటకాగుతారు? పార్టీ కోసం నేను పోరాడుతుంటే వాళ్లు (ఏపీ నేతలు) కాంట్రాక్టులు ఎలా తీసుకుంటారు? ఇలాగైతే పార్టీ ఎలా మనుగడ సాగిస్తుంది' అని రేవంత్‌ చంద్రబాబు అనుకూల వర్గం నేతలను నిలదీసినట్టు తెలిసింది.

నిలదీసిన టీటీడీపీ నేతలు.. ఒంటరైన రేవంత్

నిలదీసిన టీటీడీపీ నేతలు.. ఒంటరైన రేవంత్

టీటీడీపీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఒంటరయ్యారు. టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ గౌడ్‌లు రేవంత్ రెడ్డిని నిలదీశారు. కాంగ్రెస్ నేతల(రాహుల్ గాంధీ సహా ఇతర నేతల)ను కలిశారా? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని అడిగారు. బాబుకు తెలియకుండా వారితో భేటీ అయ్యే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

బాబుతోనే తేల్చుకుంటా.. ఉమామాధవరెడ్డి ప్రశ్నల వర్షం

బాబుతోనే తేల్చుకుంటా.. ఉమామాధవరెడ్డి ప్రశ్నల వర్షం

అయితే, నోరుమెదపకుండా ఉన్నారు రేవంత్. తాను చంద్రబాబుతోనే అన్ని విషయాలపై తేల్చుకుంటానని చెప్పారు. మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు ఉమామాధవరెడ్డి. తాము పార్టీ మారతామని లీకులెందుకు ఇస్తున్నావంటూ నిలదీశారు ఉమా మాధవరెడ్డి.

మోత్కుపల్లి-రేవంత్‌ల తీవ్ర వాగ్వాదం..

మోత్కుపల్లి-రేవంత్‌ల తీవ్ర వాగ్వాదం..

కాగా, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మీడియా కథనాలకు నేను ఎలా బాధ్యుడిని అవుతానంటూ రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలను కలిశావంటూ ప్రశ్నిస్తున్నారు.. కానీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటామని చంద్రబాబును అడిగే ప్రకటించారా? అని రేవంత్ నిలదీశారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో వెంటనే సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ఇది ఇలా ఉండగా, రేవంత్ పార్టీ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని, పార్టీ బలోపేతంపైనే చర్చించినట్లు రావుల చంద్రశేఖర్ చెప్పారు.

లోకేష్ ఆరా..

లోకేష్ ఆరా..

ఇది ఇలా ఉండగా, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దాదాపు ఖరారైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ హైదరాబాద్‌లో మకాం వేశారు. తాజా భేటీతోపాటు తెలంగాణ టీడీపీలో జరుగుతున్న పరిణామాలను ఆయన ఆరా తీస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మూడు రోజులపాటు లోకేశ్‌ హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు తెలిసింది. రేవంత్‌కు అసలు పార్టీని వీడాల్సిన అవసరం ఏమొచ్చిందనే అంశంపై లోకేష్ ఆరా తీస్తున్నారు. కాగా, గత రెండ్రోజుల క్రితం అమరావతిలో లోకేష్‌ను కలిసిన టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య కలిసి తాజా పరిణామాలపై వివరించారు.

English summary
It is said that TDP General secretary Nara Lokesh enquiries on Revanth Reddy party change issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X