41 ఏళ్ల వర్షతో.. 61 ఏళ్ల వయస్సులో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు పెళ్లి
తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు పెళ్లి చేసుకున్నారు. 61 ఏళ్ల వయస్సులో ఆయన 41 ఏళ్ల వయస్సున్న హైకోర్టు న్యాయవాది అక్కి వర్షను నాంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు.
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు పెళ్లి చేసుకున్నారు. 61 ఏళ్ల వయస్సులో ఆయన 41 ఏళ్ల వయస్సున్న హైకోర్టు న్యాయవాది అక్కి వర్షను నాంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. పలువురు ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, గ్రేటర్ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ఆ తర్వాత ప్రేమగా చిగురించిందని అంటున్నారు. 61 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న నారదాసు లక్ష్మణ రావు ప్రేమ వివాహం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.

నారదాసు కరీంనగర్ జిల్లాకు చెందిన తెరాస నేత. ఆయన ఇటీవలి వరకు వివాహం గురించి ఆలోచించలేదు.
గతంలో పీపుల్స్ వార్‌లో పని చేసిన ఆయన ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. లక్ష్మణ రావు గత అక్టోబర్ నెలలో రిజిస్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతం నారదాసు ఆదర్శ్ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులో నివసిస్తున్నారు.












Click it and Unblock the Notifications