చిలుకానగర్‌ ఘటన: ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మొండమెక్కడ?

హైదరాబాద్: హైద్రాబాద్ ఉప్పల్ చిలుకా నగర్ చిన్నారి తల భవనంపై దొరికిన ఘటన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిలుకానగర్‌లోని ఓ ఇంట్లో చిన్నారి తల బాగం వెలుగు చూసింది. క్షుద్రపూజల కోసం చిన్నారిని బలి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చిలుకానగర్ ‌లోని ఇంటిపై చిన్నారి ఫిబ్రవరి 1వ, తేదిన వెలుగు చూసింది.క్షుద్రపూజల కోసమే చిన్నారిని బలి ఇచ్చారని అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెకానిక్ నరహరిని అతని కొడుకు రంజిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Narahari and ranjith arrested for chilkanagar girl murder case

. గ్రహణ సమయంలో పూజలు చేసి చిన్నారిని బలిచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి మృతదేహం ఇంకా లభించలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

ఉప్పల్‌ సర్కిల్‌ చిలుకానగర్‌ డివిజన్‌ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే రాజశేఖర్‌ (35) క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం కుటుంబమంతా మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఆయన అత్త బాలలక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లారు. అక్కడ ఎవరో చిన్నారి తల కనబడటంతో వచ్చి కుటుంబీకులకు చెప్పారు. డాబాపైకి వెళ్లి చూసిన రాజశేఖర్‌.. వెంటనే ఉప్పల్‌ పోలీసులకు సమాచారమిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+