శంషాబాద్ విమానాశ్రయంలో కేసీఆర్‌తో మోడీ 10 ని.లు రహస్య భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో అడుగు పెట్టారు. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గవర్నర్ నరసింహన్‌లు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో అడుగు పెట్టారు. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గవర్నర్ నరసింహన్‌లు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, ఇతరులు కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
విమానాశ్రయం నుంచి నుంచి మోడీ నేరుగా జాతీయ పోలీసు అకాడమీకి వెళ్తారు. రేపు (శనివారం) డీజీపీల సదస్సులో పాల్గొంటారు. ఇవాళ 51వ డీజీపీల సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.

గవర్నర్, సీఎంతో మోడీ ఏకాంత భేటీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గవర్నర్ నరసింహన్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ విమానాశ్రయంలో కాసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. వీరు దాదాపు పది నిమిషాల పాటు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications