Turmeric Board: నిజామాబాద్‌లో పసుపు బోర్డు .. 29న అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం
National Turmeric Board: ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు ఒక చారిత్రాత్మక మైలురాయి అని, తెలంగాణకు గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 29న జరగనున్న భారీ కిసాన్ సభ కోసం నిజామాబాద్‌లో జరుగుతున్న ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఈ సమావేశం నిర్వహించనుండగా.. ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను సమీక్షించారు.
పసుపు బోర్డు ఏర్పాటు నిజామాబాద్‌లోని పసుపు రైతులకు ఒక ప్రధాన డిమాండ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇది గత ఎన్నికలలో ఒక కీలక అంశంగా కూడా మారింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన అర్వింద్, 2019 లోక్‌సభ ఎన్నికలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె కె. కవితను ఓడించారు.

పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పసుపు బోర్డును తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించాయని చెప్పారు. అయితే ప్రధాని మోడీ ప్రత్యేకంగా నిజామాబాద్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పసుపుబోర్డు నిజామాబాద్ రైతులకు కేంద్రం నుంచి వచ్చిన గొప్ప బహుమతిగా ఆయన అభివర్ణించారు. పసుపు బోర్డు ఛైర్మన్‌గా జిల్లాకు చెందిన రైతుబిడ్డ పల్లె గంగారెడ్డిని నియమించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పసుపు ఉత్పత్తిని పెంచేందుకు, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.
నిజామాబాద్‌లో జూన్ 29న కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా (@AmitShah)గారు జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
— G Kishan Reddy (@kishanreddybjp) June 26, 2025
ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న కిసాన్ బహిరంగ సభ ఏర్పాట్లను గౌరవ నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ (@Arvindharmapuri)… pic.twitter.com/zdOlPecNIU












Click it and Unblock the Notifications