Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NAVEEN YADAV : 16 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఫస్ట్ టైమ్ విక్టరీ.. కానీ భయపెడుతున్న సెంటిమెంట్ !!

నవీన్ యాదవ్.. కాంగ్రెస్ అభ్యర్ధిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. ఈ బై ఎలక్షన్ లో దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు నుంచే ఆధిక్యం కనబరిచిన నవీన్.. ఈవీఎంల లెక్కింపులోనూ మొదటి రౌండ్ నుంచే దూసుకుపోయారు. మొత్తం పది రౌండ్ లలో అన్ని రౌండ్లలోనూ బీఆర్ఎస్ కంటే ముందుంజలో ఉన్న నవీన్.. కేవలం ఒక మూడో రౌండ్‌లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో స్వల్ప మెజారిటీ కోల్పోయారు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ మళ్లీ జోరు అందుకోవడంతో కారు పార్టీ వెనుకంజ వేసింది. చివరికి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఫ్యామిలీ..

చిన్న శ్రీశైలం యాదవ్, భారతి దంపతులకు నవీన్ యాదవ్ నవంబర్ 17, 1983న జన్మించారు. వీరి స్వస్థలం హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ. నవీన్ బీ.ఆర్క్ (ఆర్కిటెక్చర్) పూర్తి చేసి వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ గా చేస్తున్నారు. నవీన్ యాదవ్‌ బీఆర్ఎస్ కీలక నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కుమార్తె వర్షను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి అన్ష్‌ యాదవ్ అనే కుమారుడు ఉన్నారు.

naveen-yadav-victory-in-jubilee-hills-bypoll-and-sentiment-details

పొలిటికల్ కెరీర్..

నవీన్ యాదవ్ తొలిసారిగా 2009లో ఎంఐఎం పార్టీ నుంచి యూసుఫ్‌గూడ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మురళీ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 41,656 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2015లో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా రహ్మత్‌నగర్‌ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో 18,817 ఓట్లు సాధించాడు. ఆ తర్వాత 2023లో అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు నవ యువ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు.

భయపెడుతున్న సెంటిమెంట్..!

అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016 నుంచి 2025 వరకు.. ఇప్పటికీ మొత్తం తొమ్మిది సార్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించారు. కాగా నాటి నుంచి జరిగిన అన్ని ఉపఎన్నికల్లోనూ సానుభూతి అస్త్రం పని చేయలేదని చెప్పాలి. ఎన్నికలు అన్నింటిలో అధికార పార్టీ అభ్యర్ధులే విజయం సాధిస్తూ వస్తున్నారు. అంతే కాకుండా ఉపఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం తర్వాతి ఎన్నికల్లో ఓటమిపాలవుతూ వస్తున్నారు.

అయితే 2015 ఆగస్టులో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి హార్ట్ అటాక్‌తో చనిపోయారు. దీంతో 2016లో ఉపఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ తరఫున కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి పోటీలో నిలిచి.. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భూపాల్ రెడ్డి 58,508 ఓట్ల తేడాతో సంజీవరెడ్డిపై గెలిచారు. ఈయన మాత్రమే ఈ రికార్డును తిరగరాసినట్టు తెలుస్తోంది. దీంతో నవీన్ యాదవ్ ఈసారి మళ్లీ రికార్డు సృష్టిస్తారా ? లేదా సెంటిమెంట్ రిపీట్ చేస్తారా అని జోరుగా చర్చ నడుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+