నయనతార సంచలన నిర్ణయం
జవాన్ సినిమాతో హిందీ పరిశ్రమలోకి ప్రవేశించారు నయనతార. భారీ విజయం దక్కడంతో ఆమె ముందు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయికానీ ఇకనుంచి బాలీవుడ్ సినిమాల్లో నటించాలనుకోవడంలేదని నయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ నయనతార. గెస్ట్ ఆర్టిస్ట్ గా దీపికా పడుకొనే నటించారు. సినిమా విడుదలైన తర్వాత చూసుకుంటే దీపిక పాత్ర హైలైట్ అయింది.
ఆ పాత్ర అలా హైలైట్ కావడంలో దర్శకుడు అట్లీదే ప్రముఖ పాత్ర అని తేలడంతో నయనతార అట్లీపై మండిపడుతోంది. హిందూస్థాన్ టైమ్స్‌తో నయన సన్నిహితులు మాట్లాడుతూ, " జవాన్ సినిమాలో తన పాత్రను కట్ చేయడం ఆమెకు నచ్చని అంశం అని.. అదే సమయంలో దీపికా పదుకొనె పాత్ర బాగా వచ్చేలా ఎలివేట్ చేశాడని.. అందుకే అట్లీపై నయనతార గుర్రుగా ఉందని" వ్యాఖ్యానించారు.

కోలీవుడ్ పరిశ్రమలో కూడా నయన చాలా అసంతృప్తిగా ఉందనే విషయం వైరల్ గా మారింది. షారుక్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించి జవాన్ సూపర్ హిట్ దిశగా దూసుకువెళుతోంది. వెయ్యికోట్ల రూపాయలు వసూలు చేసే దిశగా ఈ సినిమా పయనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి రూ.907 కోట్లను కలెక్ట్ చేసింది. ఈవారం చివరకు వెయ్యికోట్ల రూపాయలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో నయన ఫోర్స్ వన్ హెడ్ పాత్రలో నటించింది. నయనతారపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆమె అట్లీపై కోపంగానే ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాల్లో నటించడంపట్ల కూడా విముఖత చూపుతోంది. భవిష్యత్తులో ఏదైనా సినిమాలో నటిస్తుందేమో చూడాలి మరి.












Click it and Unblock the Notifications