‘భువనగిరి నాదే’: ఎమ్మెల్యే హత్యకు నయీమ్ కుట్ర, భారీ ప్రణాళికలు!

హైదరాబాద్: ఇటీవల షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ గత కొంత కాలం నుంచే రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు విస్తృతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, భారీ ప్రణాళిలు కూడా సిద్దం చేసుకున్నాడు. అవన్నీ అమలు చేసుకుందామనుకున్న సమయంలోనే పోలీసులకు చిక్కి ఎన్‌కౌంటర్‌లో హతమవడంతో అతని కలలు కల్లలుగానే మిగిలపోయాయి.

అయితే, తాను ఏనాటికైనా సరే.. భువనగిరి ఎమ్మెల్యే అంటూ పదే పదే తన సహచరులకు నయీం చెప్పుకున్నాడట. అంతేకాదు, తన జీవిత లక్ష్యం ఇదేనని ప్రచారం చేసుకున్నాడట. దానికి తగ్గట్టుగానే వ్యూహాలు పన్నినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఇప్పటికిప్పుడు కాకపోయినా.. మరో ఐదారేళ్ల తర్వాతైనా సరే.. ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతానని పలుసార్లు ఫోన్ సంభాషణలో వెల్లడించాడని సమాచారం. భువనగిరిని కేరాఫ్ అడ్డాగా చేసుకొని తన అసాంఘిక కార్యకలాపాలను సాగించిన నయీం అదే నియోజకవర్గాన్ని ఏలుదామని లక్ష్యంగా పెట్టుకోవడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది.

ముందునుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు

ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖ అండదండలతో రెచ్చిపోయి వేల కోట్ల రూపాయల ఆస్తులు దోచుకున్న నయీం.. రాజకీయాల్లోకి వచ్చే లక్ష్యంతోనే ప్రణాళికలు కూడా రూపొందించుకున్నాడని తెలిసింది. భువనగిరి హెడ్‌క్వార్టర్ శివారు ప్రాంతాల్లోనే 2వేల ఎకరాలకు పైగా భూదందా సాగించినట్లు అల్కాపురిలోని ఇంట్లో లభించిన డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి.

కాగా, ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు కూడా నయీం భారీ స్కెచ్ వేశాడు. గత ఐదేళ్ళుగా యువతకు క్రికెట్ కిట్లు, వినాయక విగ్రహాలు.. ఇలా పలు వర్గాల ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు భారీగానే ఖర్చు పెట్టాడు. దానికితోడు భువనగిరి నుంచే అనుచరులను పెట్టుకొని ఇతర ప్రాంతాల్లో సెటిల్‌మెంట్లు చేశాడు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఓటుకు భారీ మొత్తంలో చెల్లించేందుకు సైతం ప్రణాళికలు వేసుకున్నాడు.

Nayeem eyes on Bhuvanagiri

నయీమ్ హత్యానంతరం: రూ.2కోట్ల చీరలు, సామగ్రి సీజ్

రాజకీయ రంగ ప్రవేశంలో భాగంగా ఓటర్లకు చీరలు, సారెలు పంచేందుకు కూడా భారీగానే ఖర్చు పెట్టాడు నయీమ్. సంపాదనలో ప్రతీ ఏటా 15శాతం తన నియోజకవర్గ ప్రజలకు కేటాయించాలని ఐదేళ్ల కిందటే నిర్ణయించుకున్నట్టు పోలీసుల విచారణలో కుటుంబసభ్యులు వెల్లడించినట్టు సమాచారం. నల్గొండ జిల్లాల్లోని పలు నయీమ్ స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు.. రూ.2కోట్ల విలువైన చీరలు, పసుపు కుంకుమ, గాజులు, తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

రాజకీయం కోసం లొంగిపోవాలనుకున్నాడు

రాజకీయం కన్నేసిన నేపథ్యంలో నయీమ్ తనకు సమయం వచ్చినప్పుడే స్వయంగా పోలీసులకు లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నాడని పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన అనుచరుడు వెల్లడించినట్టు సమాచారం. న్యాయపరంగా చిక్కులు రాకుండా కూడా కేసుల నుంచి ఎలా బయటపడాలో కూడా వ్యూహం రచించుకున్నట్టు వెల్లడైంది.

ప్రస్తుతానికి రాష్ట్రంలో నయీం ఏ-1 నిందితుడిగా ఉన్న కేసులు కేవలం 10 మాత్రమే. ఏ4, ఏ5 గా ఉన్న కేసులు మరో ఐదు వరకు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ 10 కేసుల బయటపడటానికి నయీం న్యాయ సలహా కూడా తీసుకున్నాడని అనుచరులు పోలీసులకు తెలిపారు.

తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి సరిగ్గా ఏడాది ముందు పోలీసులకు లొంగిపోయేలా ప్లాన్ చేసుకున్నట్టు బయటపడింది. అంతేగాక, తాను అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో 25శాతం(సుమారు రూ.350 కోట్లు) మాత్రమే ప్రభుత్వం జప్తు చేసుకునేలా వ్యూహం రచించినట్టు అనుచరుల విచారణలో వెల్లడైంది.

భువనగిరి ఎమ్మెల్యే హత్యకు కుట్ర

ప్రస్తుతం భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్న పైళ్ల శేఖర్‌రెడ్డి పదే పదే తన దందాలో అడ్డువస్తున్నాడని నయీమ్ ఆగ్రహానికి గురయ్యాడు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడంతోపాటు నయీమ్ చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించడం ప్రారంభించాడని, దీంతో భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిని నయీం టార్గెట్ చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది.

ఈ విషయంపై కూడా నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండటంతోపాటు శేఖర్‌రెడ్డి భద్రతను కూడా పెంచినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్‌కౌైంటర్‌లో నయీమ్‌ను హతమార్చకుంటే.. మరికొద్దిరోజుల్లోనే భువనగిరి ఎమ్మెల్యేపై దాడికి యత్నించే అవకాశాలు ఉండేవని ఆ జిల్లా పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అంతేగాక, నయీమ్‌ను హతమార్చకుంటే మరిన్ని హత్యలు, దోపిడీలు, అరాచకాలు జరిగేవని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+