వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం 'కొత్తకోణాలు': అమ్మాయిలు ఎరగా, దుబాయ్ నుంచి 'ఎస్' కంపెనీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/నల్గొండ: గ్యాంగ్ స్టర్ నయీం దావూద్ ఇబ్రహీంలో ఎస్ కంపెనీ పేరుతో దందా నడపాలని ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అతను గత ఏడాది దుబాయ్ వెళ్లి వచ్చాడు. అక్కడికి మకాం మార్చి దందా నడిపించాలని చూశాడని తెలుస్తోంది.

నయీం దందాలు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలోను ఉన్నందున ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటి దాకా అతని ఆస్తులను రూ.2,500 గుర్తించినట్లుగా తెలుస్తోంది. అంతకుమించే ఆస్తులు ఉంటాయని భావిస్తున్నారు.

అమ్మాయిలను ఎరవేసేవాడు

నయీం గురించి ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాను టార్గెట్ చేసిన వారికి అందమైన అమ్మాయిలను ఎరగా వేసి, వారు ట్రాప్‌లో పడేట్టు చేయడంలో నయీం సిద్ధహస్తుడని తెలుస్తోంది. ఆ పని చేసేందుకు స్వయంగా ఎంపిక చేసుకున్న వారిని వినియోగించాడని పోలీసులు గుర్తించారని సమాచారం.

నయీం తల్లి కంటతడి

నయీం తల్లి కంటతడి

తన కడుపు కోతకు కారణం పోలీసులేనని, నక్సలైట్లకు వ్యతిరేకంగా తన కొడుకును వాడుకున్న పోలీసులు, వారి తూటాలకే తన బిడ్డను బలి చేశారని నయీం తల్లి తహేరా బేగం మంగళవారం ఆరోపించారు.

నయీం తల్లి కంటతడి

నయీం తల్లి కంటతడి

నయీం మృతదేహాన్ని అతని స్వగ్రామమైన భువనగిరి పట్టణానికి మంగళవారం తీసుకు వచ్చిన అనంతరం.. మీడియాతో అతని తల్లి మాట్లాడింది. ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నయీంను అతని భార్యాబిడ్డలు కడసారి చూసే అవకాశం కూడా లేకుండా పోలీసులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

నయీం తల్లి కంటతడి

నయీం తల్లి కంటతడి

నాలుగు రోజుల క్రితమే తనను, తన కోడలు, ఇతర కుటుంబసభ్యులను పోలీసులు పట్టుకుపోయారని, తన కొడుకు మృతి చెందిన విషయం కూడా చెప్పకుండా తనను భువనగిరికి తీసుకువచ్చారని ఆమె వాపోయారు.

నయీం తల్లి కంటతడి

నయీం తల్లి కంటతడి

ఇదిలా ఉండగా.. నయీం కేసులో పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు పోతున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నయీం అనుచరులు, బంధువులు, అతనికి సహకరించిన వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

నయీం తల్లి కంటతడి

నయీం తల్లి కంటతడి

విలువైన పత్రాలతోపాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

నయీం తల్లి కంటతడి

నయీం తల్లి కంటతడి

నయీం మృతదేహం మంగళవారం సాయంత్రం భువనగిరికి చేరుకున్న తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

నయీం తల్లి కంటతడి

నయీం తల్లి కంటతడి

మృతదేహాన్ని ఇక్కడికి తెస్తున్నట్లు భార్య, పిల్లలకు చెప్పలేదని నయీం తల్లి ఆరోపించారు. వారు వచ్చేవరకు ఖననం జరిపేదిలేదని చెప్పారు. రాత్రి పొద్దుపోయాక ఖననం చేశారు.

నయీం తల్లి కంటతడి

నయీం తల్లి కంటతడి

కుటుంబం విషయంలో నయీం చాలా జాగ్రత్తగా ఉండేవాడని తెలుస్తోంది. మా ఫీల్డ్ వేరని, మీరు మాతో ఉండలేరని చెప్పి తమను పక్కన పెట్టాడని, మేం కూడా అతనికి చాలా దూరంగా ఉంటున్నామని, ఫోన్ చేస్తేనే మాట్లాడుతున్నామని బంధువులు చెబుతున్నారు.

నయీం అనుచరుల కోసం వేట

నయీం అనుచరుల కోసం వేట

ఇంకోవైపు, నయీం అనుచరగణం కోసం పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది. సోమవారం నుంచే పోలీసులు ముఖ్య అనుచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించారు. బంధువులు, అతనికి సహకరించిన వారిపై కేసులు నమోదు చేశారు.

పోలీసుల సోదాలు

పోలీసుల సోదాలు

పోలీసులు బృందాలుగా విడిపోయి మంగళవారం కూడా భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, సంస్థాన్‌నారాయణపూర్, చౌటుప్పల్‌, మిర్యాలగూడ, వలిగొండల్లోని నయీం అనుచరుల నివాసాలపై సోదాలు, దాడులు నిర్వహించారు.

కొందరు అజ్ఞాతంలోకి

కొందరు అజ్ఞాతంలోకి

భూములకు సంబంధించిన దస్త్రాలు, నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నయీం మృతి చెందారన్న విషయం తెలుసుకున్న పలువురు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. పాతికేళ్లుగా నేర సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్న నయీంకు జిల్లా వ్యాప్తంగా చాలామంది అనుచరులు ఉన్నారు.

యువకులను చేరదీసి..

యువకులను చేరదీసి..

విస్తృతమైన నెట్‌వర్క్‌తో భూదందాలు, అక్రమ వసూళ్లు, వివాదాల వివరాలు సేకరించి ద్వితీయ శ్రేణి అనుచరులకు సమాచారం అందించే వ్యవస్థ ఉంది. ముఖ్యంగా యువకులను చేరదీసి వారి ద్వారా సమాచారం సేకరించేవారు. వారికి ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలు, నెలసరి వేతనాలు ఇచ్చేవారు.

అనుచరుల అరెస్ట్

అనుచరుల అరెస్ట్

పోలీసులు ఇప్పటికే భువనగిరి ఎంపీపీ వెంకటేష్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని ఒక తపంచా, నాలుగు తూటాలు, రెండు ప్లాట్లకు సంబంధించిన పత్రాలు, భువనగిరికి చెందిన కౌన్సిలర్‌ అబ్దుల్‌ నాసర్‌ను పట్టుకుని తపంచా తూటాలు, భూ దస్త్రాలు, రూ.71వేలు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించారు.

రెండు గ్యాంగులు నడిపిన నయీం

రెండు గ్యాంగులు నడిపిన నయీం

నయీం రెండు రకాల గ్యాంగులు నడిపించాడు. భూవ్యవహారాలు, ఆర్థికాంశాలు సెటిల్‌చేసేది ఒకటైతే, బెదిరింపులకు లొంగని వారిని ఖతం చేసే క్రిమినల్ గ్యాంగ్ మరొకటి. సెటిల్మెంట్లు, డబ్బుల వ్యవహారాలు కుటుంబ సభ్యులకు అప్పగించిన నయీం, బెదిరింపులతో దారికి రాని వారిని అడ్డుతొలగించేందుకు కరడుగట్టిన నేరస్థులతో మరో గ్యాంగ్ నడిపించాడని పోలీసు విచారణలో తేలింది.

ఆర్థిక వ్యవహారాలు

ఆర్థిక వ్యవహారాలు

ఆర్థిక వ్యవహారాలను నయీం చిన్నమ్మ కొడుకు ఫాహిం చూసేవాడని తెలుస్తోంది. నారాయణపూర్ వాసి ఫాహిం కొంతకాలం వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో ఉన్నాడు. సోహ్రబుద్దీన్ కేసులో సిబిఐ విచారణ కోసం ఇక్కడకు వచ్చిన సమయంలో తప్పించుకున్నాడు.

రియల్ దందాల్లో ప్రమేయం

రియల్ దందాల్లో ప్రమేయం

ఫాహింకు నయీం తన అక్క కూతురునిచ్చి పెళ్లి చేశాడు. జిల్లా కేంద్రం నల్గొండతో పాటు భువనగిరి, ఘట్‌కేసర్, చౌటుప్పల్, నారాయణపుర్, సూర్యాపేట, నకిరేకల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్ తదితర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ దందాల్లో ఇతని ప్రమేయం ఉందని సమాచారం.

డ్రైవర్ పేరిట పత్రాలు

డ్రైవర్ పేరిట పత్రాలు

నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌వాసి శ్రీధర్ వృత్తిరీత్యా డ్రైవర్ కావటంతో ఫాహిం అతనిని డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. నమ్మకంగా ఉండడంతో భూ దందాలలో సేకరించిన ఆస్తులను శ్రీధర్ పేరిట కూడ రిజిస్టర్ చేయించాడు. శ్రీధర్ గౌడ్ ఇంట్లో రూ. లక్షల నగదు, విలువైన పత్రాలు లభ్యమయ్యాయి.

భూములపై కన్ను

భూములపై కన్ను

రంగారెడ్డి శివారు, నల్గొండ జిల్లాలోని ఘట్‌కేసర్, భువనగిరి, చౌటుప్పల్, నకిరేకల్ ప్రాంతాలలో హైవే, అంతర్గత రోడ్లకు ఆనుకొని ఉన్న పొలాలు, ప్లాట్లపై నయాం కన్ను పడేది. ఏదైనా భూమి లేదా ప్లాట్‌మీద కన్ను పడిందో అంతే ఆ ప్లాట్లలో గ్రీన్ కలర్ బోర్డులు పాతి అందులో కాంటాక్ట్ నెంబర్ రాసేవారు.

తొలుత.. మార్కెట్ రేటు కంటే తక్కువ

తొలుత.. మార్కెట్ రేటు కంటే తక్కువ

స్థల యజమాని ఇదేమిటని ఫోన్ చేస్తే మీ పొలం భాయ్‌కి కావాలి.. వస్తే మాట్లాడుదాం.. అంటూ బెదిరించేవారని తెలుస్తోంది. చర్చలకు పాహిం రంగంలోకి వచ్చేవాడు. మార్కెట్ రేటులో పావు వంతు ఇచ్చేందుకు మొగ్గు చూపేవారు. బెదిరింపులకు దిగేవారు.

తర్వాత.. బెదిరింపు

తర్వాత.. బెదిరింపు

ఆ బెదిరింపులతో పని కాకపోతే రెండో గ్యాంగ్ రంగంలోకి వచచేది. ఒళ్లు జలదరించేలా కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి దారుణ హత్యలు చేసేవారని తెలుస్తోంది.

నయీం అని తెలిసినా..

నయీం అని తెలిసినా..

ఇది నయీం పనే అని అందరికీ తెలిసినా ఈ ముఠా పోలీసులకు ఒకటి రెండు రోజులలోనే లొంగిపోయి నేరం తమమీద వేసుకునేది. తద్వారా నేరం తన మీద పడకుండా నయీం చూసుకునేవాడు.

ఎక్కడికైనా సెటిల్మెంట్లు జరిపేందుకు వెళ్లాల్సి వస్తే తనతో పాటు మహిళలను, యువతులను వాహనంలో వెంట పెట్టుకొని వెళ్లేవాడు. అలా వెళ్తే పోలీసులకు అనుమానం రాదని నయీం ఉద్దేశ్యం. అదే సమయంలో తాను టార్గెట్ చేసిన వారికి కూడా ఎరవేసేవాడని తెలుస్తోంది.

అందంగా ఉండి చిన్న వయసులో భర్తను కోల్పోయిన వారు, అనాధలైన వారికి ఆశ్రయం పేరిట లోబరచుకుని వారిని వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

నయీం హత్యానంతరం అరెస్టైన ఇద్దరు యువతులు కూడా వంటవారు కాదని, అల్కాపురి ఇంట్లో ఎన్నడూ వంట చేసిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. హోటళ్ల నుంచి తెచ్చుకుని తినే వారని, వంట మనిషిగా చెబుతున్న ఫర్హానాను సెక్యూరిటీగా మాత్రమే వాడుకున్నాడు.

పోలీసుల అదుపులో శ్రీధర్ గౌడ్, అనుచరుడు రియాజ్ అరెస్ట్

వనస్థలిపురంలోని శ్రీధర్ గౌడ్ నివాసంలో నయీం తన సెటిల్మెంట్లు చేసేవాడు. శ్రీధర్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు, నయీం అనుచరుడు రియాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని ఓ అపార్టుమెంటులో అదుపులోకి తీసుకొని, భువనగిరికి తరలించారు. అతని నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
When Nayeem was alive, the police were scared to raid his dens despite having information about arms and illegal cash there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X