వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం డైరీలో 'కడప', అధికారుల ఆరా: గెలిచే దాన్నిగా.. ఉమామాధవరెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో ఎన్‌కౌంటర్ అయిన నయీం డైరీలో కడప పేరు కూడా ఉన్నట్లుగా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు) అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక జిల్లాల్లో నయీం మూలాలు కడపకు కూడా పాకాయని తెలుస్తోంది.

నయీం డైరీలో కడప జిల్లాకు సంబంధించిన వారి వివరాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో తెలంగాణ పోలీసులు ఆదివారం రాత్రి కడపకు చేరుకొని విచారణ జరిపారు. కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతంలో కొందరు వ్యక్తుల గురించి ఆరా తీశారని తెలుస్తోంది.

ఫర్హానా, అఫ్సానాకు ఆరు రోజుల కస్టడీ

నయీం కేసులో ఫర్హానా, అఫ్సానాలకు న్యాయస్థానం ఆరు రోజుల పాటు దర్యాఫ్తు అధికారుల కస్టడీకి ఇచ్చింది. నయీం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది.

మరోవైపు నయీం అనుచరుడు, డ్రైవర్ సమీరుద్దీన్‌ను పోలీసులు మంగళవారం నాడు హయత్ నగర్ కోర్టులో ప్రవేశ పెట్టారు.కేసులో సమీరుద్దీన్ 6వ నిందితుడిగా ఉన్నాడు. గతంలో సమీర్.. నయీంకు డ్రైవర్‌గా పని చేశాడు.

నయీం కేసులో ఎవర్నీ వదలం: కర్నె

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తాము ఎవరినీ వదిలేది లేదని తెరాస నేత కర్నె ప్రభాకర్ ఈ రోజు అన్నారు. నయీం కేసు దర్యాఫ్తు ముమ్మరంగా సాగుతోందన్నారు. కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలి పెట్టేది లేదన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పారు.

కస్టడీకి అఫ్సానా, ఫర్హానా

కస్టడీకి అఫ్సానా, ఫర్హానా

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈ నేపథ్యంలో అతని అనుచరులు, ఇతరుల నుంచి వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఫర్హానా, అఫ్సానాను ఆరు రోజుల కస్టడీకి తీసుకుంటున్నారు.

ఉమా మాధవ రెడ్డి

ఉమా మాధవ రెడ్డి

నయీంతో పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత ఉమా మాధవ రెడ్డి పేరు వెలుగు చూసింది. అయితే తనకు నయీంతో సంబంధాలు లేవని, గత ఎన్నికల్లో నయీం తన కోసం డబ్బులు ఖర్చు పెడితే, అతను తన వైపు ఉంటే నేనే గెలిచేదానిని కదా అని ఉమా మాధవ రెడ్డి చెబుతున్నారు.

నయీం

నయీం

నయీం తన అక్రమాల కోసం ఇటు పోలీసులు, రాజకీయ నాయకులతో పాటు కొందరు మాజీ నక్సలైట్లను కూడా ఉపయోగించుకున్నారని తెలుస్తోంది.

నయీం క్రూరత్వం

నయీం క్రూరత్వం

నయీం జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత క్రూరంగా మారిపోయాడని, అతను సొంత వాళ్లను, స్నేహితులను కూడా చంపేందుకు వెనుకాడలేదని అంటున్నారు.

English summary
Nayeemuddin had used several former Maoists in Telangana for his illegal activities. Nayeem used to send them to businessmen in Nalgonda to threaten and collect money. His gang also used to collect hafta from rich traders and realtors in the district, revealed the gangster’s former classmate S. Ramakrishna, a businessman from Bhongir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X