రెండ్రోజుల్లో లేపేస్తా: ఎన్‌కౌంటర్‌కు ముందు ఇద్దరికి నయీమ్ డెడ్‌లైన్
హైదరాబాద్: మాజీ నక్సల్, గ్యాంగ్‌స్టర్ నయీమ్ తన ఎన్‌కౌంటర్‌కు ముందు కూడా ఇద్దర్ని హత్య చేసేందుకు తేదీలు ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే వందల కేసుల్లో నిందితుడిగా ఉన్న నయీమ్.. తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఇతర జిల్లాలపై కూడా పట్టుకోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఎప్పుడూ మందీమార్బలంతో, ఆయుధాలతో తిరిగే నయీం కేవలం కారు డ్రైవరుతో కలిసి ఒంటరిగా షాద్‌నగర్‌కు ఎందుకు వచ్చి ఉంటాడు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, మహబూబ్‌నగర్ జిల్లాలోనూ అతడు తన నేర కార్యకలాపాలను విస్తరించినట్లు సమాచారం. ఇప్పటికే అచ్చంపేట పరిసరాల్లో అనుచరులుండగా షాద్‌నగర్, కొత్తూరు పరిసరాల్లోనూ అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.

అజిలాపూర్ గ్రామానికి చెందిన పలువురిని భూదందాలో భాగంగా ఇటీవల నయీం బెదిరించినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఇద్దరికి భూ తగాదాలు సెటిల్‌మెంటు చేసుకోకపోతే ఖచ్చితంగా రెండురోజుల్లో చంపేస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే జిల్లాకు వచ్చి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.
మాజీ నక్సలైట్ పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు, నయీమ్ కీలక అనుచరుడైన శేషన్న ఆదివారం రాత్రి ఆమన్‌గల్ వద్ద ఇచ్చిన విందులో నయీం పాల్గొన్నాడని, అక్కడి నుంచే ఇటు వచ్చాడని సమాచారం. షాద్ నగర్‌లోని నివాసంలో బస చేయగా, పోలీసులు చుట్టుముట్టారు. నయీమ్ కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు నయీమ్‌ను మట్టుబెట్టారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications