సొంత ఊళ్లో ఉంటూనే రూ.లక్షలు సంపాదించే అవకాశం
డబ్బు సంపాదనకు, వ్యాపారం చేయడానికి ఎటువంటి సంబంధం ఉండదు. అక్షరం ముక్క రానివారు కూడా లక్షలాది రూపాయలను సంపాదిస్తున్నారు. అక్షరం వచ్చినవాళ్లు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉన్న ప్రాంతంలోనే నాలుగు రాళ్లు సంపాదించాలని చాలామంది భావిస్తుంటారు. కానీ పరిస్థితులను బట్టి, పరిణామాలను బట్టి వెనకడుగు వేస్తుంటారు. అటువంటివారికి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన పంటలకు డిమాండ్ పెరుగుతోంది. అటువంటి వ్యాపారంలో చేపల పెంపకం కూడా ఒకటి. అతి తక్కువ పెట్టుబడితే ఎక్కు ఆదాయాన్నిస్తోందని చెప్పవచ్చు.
అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలే చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాదు.. చేపల పెంపకానికి సంబంధించి రుణాలను కూడా అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్ ద్వారా ఈ తరహా వ్యాపారం చేసేవారికి చేయూతనందిస్తోంది. మంగూర్ చేపల పెంపకం లాభసాటిగా ఉంటోంది. చేపల ఉత్పత్తిలో చైనా, జపాన్ తర్వాత భారత్ మూడోస్థానంలో ఉంది. ఈ తరహా వ్యాపారం రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటోంది. ఎకరం చెరువు సిద్ధం చేసుకోవాలి. దానికోసం చెరువు కోసం 7 నుండి 8 pH విలువ కలిగిన మట్టిని ఎంచుకోవాలి. ఒక్క చెరువులోనే మంచినీటిని ఏర్పాటు చేయాలి.

మంగూర్ చేప 5 నుంచి 6 నెలల్లో 100 నుంనుంచి 120 గ్రాములవుతుంది. ఒక హెక్టారు చెరువులో 3 నుంచి 4 టన్నుల చేపలు ఉత్పత్తి అవుతాయి. వీటి ధర మార్కెట్‌లో కిలో రూ.200 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. మంగూర్ చేపల పెంపకానికి హెక్టారుకు దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దాదాపు రూ.3 నుంచి రూ.5 లక్సల వరకు సులభంగా సంపాదించవచ్చు. మంగూరు చేపలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మంచి లాభాలనిస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు కూడా చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. అంతేకాదు.. వీటిపై ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది.












Click it and Unblock the Notifications