తెలంగాణాలో కొత్త రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభం.. శుభవార్త చెప్పిన రైల్వే జీఎం!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రగతి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైల్వే కొత్త లైన్ల నిర్మాణం తో పాటు, అనేక కొత్త రైళ్లను కూడా అందిస్తోంది. వందే భారత్ వంటి అధునాతన ఎక్స్ప్రెస్ రైళ్ల సేవలతో దూసుకుపోతుంది. అంతేకాదు కొత్త రైల్వే స్టేషన్ లో ఏర్పాటు పైన కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొమురవెల్లికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి త్వరలోనే రైలు సేవలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు త్వరలోనే రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. తాజాగా మనోహరాబాద్ కొత్తపల్లి నూతన బ్రాడ్గేజ్ లైన్ నిర్మాణం పూర్తయితే కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి త్వరలోనే రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ వెల్లడించారు.

రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన జీఎం
మనోహరాబాద్ కొత్తపల్లి మార్గంలోని కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను ఆయన సమీక్షించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. నిర్ణీత లక్ష్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
సికింద్రాబాద్ సిద్దిపేట సెక్షన్ క్షుణ్ణంగా తనిఖీ
సికింద్రాబాద్ సిద్దిపేట సెక్షన్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు రైల్వే సేవలు త్వరితగతిన అందించే ప్రయత్నం చేస్తామన్నారు. రైలు సేవలు అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో సురక్షితంగా, సులభంగా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి చేరుకోవచ్చు అన్నారు.

ఇప్పటికే కొమురవెల్లి రైల్వే స్టేషన్ పై కేంద్రమంత్రి ప్రకటన
హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు వచ్చే క్రమంలో వారందరికీ ప్రయాణ సమయం, దూరం తగ్గుతుందని రైల్వే స్టేషన్ ఏర్పాటుతో పరిసరాలలో పర్యాటకం, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. వచ్చే జనవరిలో కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో పనులలో వేగం పెంచాలని తాజాగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications