తెలంగాణ కరోనా కేసుల్లో కొత్త ల్యాండ్‌మార్క్: లక్షకు పైగా: ఊరట కలిగించేలా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు రోజూ వేల సంఖ్యలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. అదే సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మెరుగుపడుతోంది. తాజాగా నమోదైన డిశ్చార్జిల సంఖ్య లక్ష మార్క్‌ను అందుకుంది. ఒకవంక కరోనా కేసుల వెల్లువ కొనసాగుతున్న సమయంలో.. దానికి అనుగుణంగా కోలుకున్న వారి సంఖ్య కూడా నమోదు కావడం ఊరట కలిగించే అంశం. కరోనా వల్ల సంభవించిన మరణాల సంఖ్య అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. రోజూ 10కి అటు ఇటుగా మరణాలు నమోదవుతున్నాయని పేర్కొంటున్నారు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2817 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 2611 మంది డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య లక్షను దాటేసింది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,33,406కు చేరుకుంది. ఇందులో 1,00,013 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 856కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 32,537గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 25,293 మంది చికిత్స పొందుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 452 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్లగొండ, సిద్ధిపేట్, సూర్యాపేట్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకూ అధికమౌతోంది. కొత్త కేసులు 200లకు పైగా నమోదవుతున్నాయి.

Newly 2817 Covid19 positive cases and 10 deaths reported in Telangana last 24 hours

24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-36, భద్రాద్రి కొత్తగూడెం-89, జగిత్యాల-88, జనగామ-41, జయశంకర్ భూపాలపల్లి-26, జోగుళాంబ గద్వాల-33, కామారెడ్డి-62, కరీంనగర్-164, ఖమ్మం-157, కొమరంభీమ్ ఆసిఫాబాద్-19, మహబూబ్ నగర్-42, మహబూబాబాద్-62, మంచిర్యాల-71, మెదక్-35, మేడ్చల్ మల్కాజ్‌గిరి-129, ములుగు-18, నాగర్ కర్నూలు-41, నల్లగొండ-157, నారాయణపేట్-21, నిర్మల్-16, నిజామాబాద్-97, పెద్దపల్లి-75, రాజన్న సిరిసిల్ల-53, రంగారెడ్డి-216, సంగారెడ్డి-76, సిద్ధిపేట్-120, సూర్యాపేట్-116, వికారాబాాద్-27, వనపర్తి-45, వరంగల్ రూరల్-46, వరంగల్ అర్బన్-114, యాదాద్రి భువనగిరి-73 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    Indira Shoban:దిశా ఎన్ కౌంటర్ తో చేతులు దులిపేసుకున్నారు, తెలంగాణ లో మహిళలకు భద్రత ఏది ? || Oneindia

    కరోనా వైరస్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోసారి 60 వేల వరకు టెస్టులను నిర్వహించారు. కొత్తగా వ్యాప్తంగా 59,711శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 15,42,978కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 41,560 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+