తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకటి రెండు రోజులు కొంత చిరుజల్లులతో ఉపశమనం లభించినా.. ఆ తర్వాత రోజు నుంచి ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. తాజాగా, వాతావరణ అంచాలను వెల్లడించింది వాతావరణ శాఖ. తెలంగాణలో రాగల రెండురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అయితే, బుధవారం నుంచి వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. గడిచిన 24గంటల్లో కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.
బుధవారం నుంచి శుక్రవారం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాగల రెండు రోజుల తర్వాత నుంచి తెలంగాణలో చాలా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, బయటకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications