వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో విధ్వంసానికి ఐసిస్ కుట్ర: ప్రధాన సూత్రధారి టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో విధ్వంసానికి ఐసిస్ సానుభూతిపరుల కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ ఛేదించడం సంచలనం సృష్ఠించిన విషయం తెలిసిందే. ఎన్ఐఎ ఈ కుట్రను భగ్నం చేయకపోతే భారీ నష్టం వాటిల్లి ఉండేది. హైదరాబాదులోని పాతబస్తీలో 11 మందిని అదుపులోకి తీసుకుంది.

ఐసిస్ మోడ్యూల్‌పై నెలరోజులుగా నిఘా పెట్టిన ఎన్ఐఎ అధికారులు చివరకు 11 మందిని అరెస్టు చేశారు. వారిలో ప్రధాన సూత్రధారని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇబ్రహీం అని తెలుస్తోంది. ఇతను ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నాడు. అతని నుంచి అధికారులు పిస్తోలుతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

హైద్రాబాద్‌లో పేలుళ్లకు ఐసిస్ కుట్ర: భారీ స్కెచ్, పోలీసులకే బెదిరింపు?హైద్రాబాద్‌లో పేలుళ్లకు ఐసిస్ కుట్ర: భారీ స్కెచ్, పోలీసులకే బెదిరింపు?

ఇబ్రహీంతో పాటు మోటార్ మెకానిక్ ఇర్ఫాన్‌ను కూడా అధికారులో అదుపులోకి తీసుకున్నారు. 11 మంది నిందితులు కూడా బంధువులేనని, వారిలో ఇద్దరు అన్నదమ్ములని సమాచారం. టార్గెట్ బోర్డ్సును పెట్టుకుని వారంతా రిహార్సల్స్ చేసినట్లు తెలుస్తోంది.

ibrahim

ఓ వైపు కాల్పులు జరుపుతూ మరో వైపు పేలుళ్లకు పాల్పడాలనేది వారి పథకంగా తెలుస్తోంది. హబీబ్ అనే నిందితుని నుంచి అధికారులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నకలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి ఇబ్రహీం యువతను ఆకర్షిస్తున్నట్లు కూడా ఎన్ఐఎ దర్యాప్తులో తేలిందని అంటున్నారు. స్వాద్ అనే నిందితుని వద్ద 15 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

ఐటి కారిడార్‌తో పాటు రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడాలని వారు పథకం వేసినట్లు చెబుతున్నారు. ఎన్ఐఎ అధికారులు హైదరాబాదులోని పాతబస్తీలో భారీగా సోదాలు నిర్వహించారు.

English summary
A suspected terror plot has been uncovered in Hyderabad, where the National Investigation Agency (NIA) and Hyderabad police busted an Islamic State cell. Raids were conducted in Moghalpura and Bhawaninagar areas of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X